Gujarat Honour killings: గుజరాత్ జామ్నగర్లో రెండు హత్యలు కలకలం రేపాయి. హాపా ప్రాంతంలో కులాంతర వివాహం చేసుకున్న ఓ యువకుడిని కొందరు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఓ షోరూం వద్ద మాటు వేసి యువకుడిని హత్య చేశారు.
ఏమైందంటే?
Jamnagar crime news: మృతుడు సోమ్రాజ్.. ఏడాది క్రితం క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. కులాంతర వివాహం కావడం వల్ల యువతి కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు అడ్డు చెప్పారు. అయినా పెద్దలను ఎదిరించి వీరిద్దరు వివాహం చేసుకున్నారు. అనంతరం యోగేశ్వర్ధామ్ సొసైటీ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరి పెళ్లిని నిరాకరిస్తున్న యువతి కుటుంబ సభ్యులు.. ఎప్పటి నుంచో యువకుడిని హత్య చేయాలని కుట్ర పన్నుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాజ్కోట్ రోడ్డు వద్ద ఉన్న ఓ షోరూం సమీపంలో మకాం వేశారు. సోమ్రాజ్ షోరూంలోకి వెళ్లగా.. వెంబడించిన యువతి తండ్రి సాతుభా ఝాలా కత్తితో పొడిచి యువకుడిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు, సోమ్రాజ్ కుటుంబ సభ్యులు సమాచారం అందుకొని షోరూంకు వెళ్లారు. యువకుడి మరణాన్ని చూసి కోపోద్రికులైన కుటుంబ సభ్యులు.. నేరుగా యువతి తల్లి ఇంటిపైకి దండెత్తారు. నిందితుడి కోసం వెతికారు. అయితే ఇంట్లో అతడి జాడ కనిపించలేదు. దీంతో యువతి తల్లి 'అషాబా సథుబా జాలా'పై దాడి చేశారు. ఆమెను కత్తులతో పొడిచి హత్య చేశారు.
ఒకేరోజు రెండు హత్యలు జరిగేసరికి జామ్నగర్లో భయానక వాతావరణం ఏర్పడింది. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు. స్వయంగా ఎస్పీ ప్రేమ్సుఖ్ దేలు ఘటనాస్థలాలను పరిశీలించారు. చివరకు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇరు కుటుంబాలు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: