ETV Bharat / bharat

కాంగ్రెస్​కు హార్దిక్ గుడ్​బై- వారిపై 'చికెన్​ సాండ్​విచ్​' పంచ్ - గుజరాత్ కాంగ్రెస్​

Hardik patel resign: కాంగ్రెస్​కు షాక్ ఇచ్చారు గుజరాత్ కీలక నేత హార్దిక్​ పటేల్. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం హస్తం పార్టీ​పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దిల్లీ నుంచి వచ్చిన నేతలకు చికెన్ సాండ్​విచ్ అందిందో లేదో చూసుకోవడం తప్ప గుజరాత్ కాంగ్రెస్​ నాయకులు ఇతర విషయాలను పట్టించుకోరని ధ్వజమెత్తారు.

gujarat-hardik-patel-quits-congress
గుజరాత్​లో కాంగ్రెస్​కు షాక్​.. హార్దిక్ పటేల్ రాజీనామా
author img

By

Published : May 18, 2022, 11:01 AM IST

Updated : May 18, 2022, 2:35 PM IST

Hardik patel news: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్​లో కాంగ్రెస్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, కీలక నేత హార్దిక్ పటేల్​ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది నవంబర్​లో గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో బలంగా ఉన్న పటేల్ సామాజిక వర్గానికి చెందిన హార్దిక్.. పార్టీని వీడటం కాంగ్రెస్​కు నష్టమే. హార్దిక్ కొంతకాలంగా పార్టీపై గుర్రుగా ఉన్నారు. పేరుకు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ అయినా తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బహిరంగంగానే విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేశారు. అయితే హార్దిక్​ ఏ పార్టీలో చేరతారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. భాజపాలో చేరతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆమ్​ ఆద్మీ పార్టీలో కూడా చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది.

వారికి చికెన్ సాండ్​విచే ముఖ్యం: పార్టీని వీడిన అనంతరం కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు హార్దిక్ పటేల్. రాష్ట్ర నాయకులకు దిల్లీ నుంచి వచ్చిన పార్టీ పెద్దలకు చికెన్ సాండ్​విచ్ సమయానికి అందిందో లేదో చూసుకోవడమే ముఖ్యమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా పట్టవని ధ్వజమెత్తారు. సమస్యలను కాంగ్రెస్ నాయకత్వం సీరియస్​గా తీసుకోదని, అదే అతిపెద్ద సమస్య అని ఆరోపించారు. దేశం సవాళ్లు ఎదుర్కొనే సమయంలో సరైన నాయకత్వం అవసరమైన ప్రతిసారి పార్టీ నేతలు విదేశీ పర్యటనలకు వెళ్తారని విమర్శించారు. గుజరాత్​, గుజరాతీలు అంటే పడనట్లు కాంగ్రెస్ అధినాయకత్వం మాట్లాడుతుందని, అలాంటప్పుడు రాష్ట్రంలో భాజపాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఉంటామని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: వీసా కుంభకోణం కేసులో చిదంబరం సన్నిహితుడు అరెస్ట్​

Last Updated : May 18, 2022, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.