ETV Bharat / bharat

'నన్ను తిట్టడంలో కాంగ్రెస్​ నేతల పోటీ.. భాజపాకు ఓటేసి బుద్ధి చెప్పండి' - pm modi speech today

Gujarat Election 2022: రావణుడితో పోలుస్తూ కాంగ్రెస్ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాముడి అస్థిత్వాన్ని నమ్మనివారు.. రావణుడి పేరును ప్రస్తావించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోదీని తిట్టడంలో కాంగ్రెస్ నేతల మధ్య పోటీ నడుస్తోందని ధ్వజమెత్తారు.

pm-modi news today
pm-modi news today
author img

By

Published : Dec 1, 2022, 2:09 PM IST

PM Modi news : కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. తనను దుర్భాషలాడటంలో ఆ పార్టీ నేతల మధ్య పోటీ నడుస్తోందని ఫైరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మోదీని రావణుడిగా పేర్కొంటూ విమర్శించిన నేపథ్యంలో మోదీ తాజాగా స్పందించారు. గుజరాత్ పంచమహల్ జిల్లాలోని కాలోల్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మోదీ.. ఇతర కాంగ్రెస్ నేతలు సైతం తనపై అనుచిత విమర్శలు చేశారని, ఓ కుటుంబాన్ని సంతోషపెట్టేందుకు వారు ఎంత దూరమైనా వెళ్తారని అన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై బురదజల్లేందుకు ప్రయత్నించిన ప్రతిసారి కమలం వికసిస్తుందని చెప్పుకొచ్చారు.

"నేను ఖర్గేను గౌరవిస్తా. పైన ఉన్నవారు ఆయన్ను ఏది చెప్పమంటే అదే చెప్తారు. ఇది రామభక్తులు ఉన్న గుజరాత్ అని కాంగ్రెస్ పార్టీకి తెలియదు. రాముడి అస్థిత్వాన్ని విశ్వసించనివారే ఇప్పుడు.. రామాయణంలోని రావణుడిని తెరపైకి తెచ్చారు. 'మోదీని వంద తలల రావణుడు' అని అనిపించారు. అంతకుముందు మరో నేత 'మోదీకి ఆయన స్థానమేంటో చూపిస్తాం' అని అన్నారు. అలాంటి కఠిన పదాలు నాపై ప్రయోగించిన వారు.. క్షమించమని అడగడం పక్కనబెడితే.. కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు. మోదీకి వ్యతిరేకంగా ఎవరు ఎక్కువగా దుర్భాషలాడతారనే విషయంపై కాంగ్రెస్ నేతల మధ్య పోటీ నడుస్తోంది.

కాంగ్రెస్ నేతలు భారత ప్రజాస్వామ్యానికి కాదు, కుటుంబానికి విధేయులుగా ఉంటారు. అందుకే నన్ను వారు తిడుతున్నారు. వారికి కుటుంబమే సర్వస్వం. ఆ కుటుంబాన్ని సంతోషపెట్టేందుకు ఏదైనా చేస్తారు. నాపై అన్ని రకాల పరుష పదాలను వాడారు. కుక్క చావు చస్తానని, హిట్లర్​లా చస్తానని అన్నారు. ఇంకో నేత అయితే.. 'అవకాశం దొరికితే మోదీని చంపేస్తా' అన్నారు. నన్ను గుజరాత్ ప్రజలే పెంచారు. ఇలాంటి పదాలన్నీ గుజరాత్​కు, ఇక్కడి ప్రజలకు అవమానకరం. ఈ విషయంలో వారికి గుణపాఠం చెప్పేందుకు ఒకే మార్గం ఉంది. డిసెంబర్ 5న జరిగే ఎన్నికల్లో భాజపాకు ఓటేయండి."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇటీవల గుజరాత్ ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. మోదీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. 'తన ముఖం చూసి ఓట్లు వేయాలని ప్రతి ఎన్నికల్లో కోరుతున్న మోదీకి రావణుడిలా ఏమైనా వంద తలలు ఉన్నాయా' అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగింది. గురువారం అహ్మదాబాద్​లో రోడ్​షోలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు. 'కాంగ్రెస్ నేతలు మోదీకి వ్యతిరేకంగా అనుచిత ఎప్పుడు చేసినా.. గుజరాత్ ప్రజలు బ్యాలెట్ ద్వారానే సమాధానం ఇచ్చారు. ఈసారి కూడా గుజరాత్ ప్రజలు తప్పక బదులిస్తారు' అని వ్యాఖ్యానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.