గుజరాత్ రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. రెండో విడతలో మొత్తం 14 జిల్లాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం ఐదు గంటల వరకు 59.11 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది.
ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ రెండో దశ పోలింగ్.. 59.11% ఓటింగ్ నమోదు - గుజరాత్ అసెంబ్లీ 20222
17:24 December 05
15:53 December 05
గుజరాత్లో శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.51 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
14:33 December 05
గుజరాత్లో శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 39శాతం ఓట్లు పోలయ్యాయి.
13:47 December 05
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 34.74 శాతం ఓటింగ్
గుజరాత్ శాసనసభ రెండో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 34. 74 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
12:33 December 05
ఓటేసిన ప్రధాని తల్లి, సోదరుడు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌లోని రాయ్సన్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. మోదీ సోదరుడు సోమాభాయ్ మోదీ సైతం రాణిప్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
11:56 December 05
ఉదయం 11 గంటల వరకు 19.17 శాతం ఓటింగ్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 19.17 శాతం ఓటింగ్ నమోదైనట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం.
11:06 December 05
ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర హోమంత్రి షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లోని నరన్పురా పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కుమారుడు బీసీసీఐ సెక్రటరీ జై షా సహా కుటుంబ సభ్యులతో వచ్చిన ఓటేశారు.
09:50 December 05
ఉదయం 9 గంటల వరకు 4.75 శాతం ఓటింగ్
గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 4.75 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం.
09:32 December 05
ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని, ముఖ్యమంత్రి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ పరిధిలో ఉన్న రాణిప్ నిషాన్ స్కూల్లో ఆయన ఓటు వేశారు. శిలాజ్ అనుపమ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.
08:01 December 05
ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. ఓటు వేయాలని ప్రధాని విజ్ఞప్తి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తాను సైతం అహ్మదాబాద్‌లో ఓటు వేస్తానని ట్వీట్ చేశారు.
06:45 December 05
గుజరాత్ రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం.. ఓటు వేయనున్న ప్రధాని మోదీ
గుజరాత్ శాసనసభ ఎన్నికల రెండోదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 89 స్థానాలకు ఈ నెల ఒకటో తేదీన ఎన్నికలు జరగ్గా, మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భాజపా, ఆప్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14జిల్లాల పరిధిలోని 93నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈనెల ఒకటిన 89స్థానాలకు పోలింగ్ జరగగా.. 63.34 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే 3శాతానికిపైగా ఓటింగ్ శాతం తగ్గింది.
రెండో విడత పోలింగ్ జరుగనున్న 93 స్థానాలకుగాను అన్నిపార్టీల తరఫున 833మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో 2.54 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారికోసం 26,409 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండో విడత ఓటింగ్ కోసం 36వేలకు పైగా ఈవీఎంలు వినియోగిస్తుండగా 1,13,325 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించనున్నట్లు గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకోనున్న మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ రెండో విడత గుజరాత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సబర్మతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న నిషాన్ స్కూల్లో ఆయన ఓటు వేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.