ETV Bharat / bharat

చిన్నారిపై అత్యాచారం.. నెలరోజుల్లో 'ఉరి' తీర్పు! - గుజరాత్ పోక్సో కోర్టు

death penalty for gujarat rapist: గత నెలలో రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనలో 35 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించింది గుజరాత్‌ పోక్సో కోర్టు. తీర్పు సందర్భంగా ఇది 'అరుదైన' కేసు అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

gujarat death sentence
గుజరాత్ కోర్టు
author img

By

Published : Dec 7, 2021, 5:19 PM IST

gujarat court death sentence: చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో ఓ వ్యక్తికి మరణశిక్ష విధించింది గుజరాత్​లోని సూరత్ న్యాయస్థానం. అంతేగాక బాధిత కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనలో గుడ్డు యాదవ్‌ అనే వ్యక్తిని దోషిగా తేల్చిన ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి పీఎస్ కళ ఈ కేసు 'అరుదైనది' అని వ్యాఖ్యానించారు.

ఏడు రోజుల్లో చార్జ్​షీట్‌..

gujarat pandesara rape case: సూరత్​లోని పండేసర ప్రాంతంలో నవంబర్ 4న ఓ చిన్నారిని అపహరించిన నిందితుడు.. అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. 8వ తేదీన కొందరిని అరెస్టు చేసిన పోలీసులు.. ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని ఐపీసీ సెక్షన్లు 376-ఏబీ (12 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం), 302 (హత్య) ప్రకారం కేసు నమోదు చేశారు. మొత్తం 43 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. ఈ కేసులో బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూసేందుకు పోలీసులు ఏడు రోజుల్లోనే చార్జ్​షీట్‌ను సమర్పించడం విశేషం.

'అత్యంత హేయం..'

rape on gujarat girl child: వాదనల సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నయన్ సుఖద్వాలా నిందితునికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అత్యంత అరుదైన కేసుగా దీనిని పరిగణించాలని కోరుతూ.. గతంలో ఈ తరహా ఘటనల్లో వివిధ కోర్టులు ఇచ్చిన 31 తీర్పులను ఉదహరించారు. బాలిక శరీరంలోని జననాంగాలు బయటపడేలా వికృతంగా ప్రవర్తించిన నిందితుని చర్య హేయమైనదని వాదించారు. చిన్నారి పట్ల అనాగరికంగా ప్రవర్తించిన నిందితునికి గరిష్ఠ శిక్ష విధించాలని కోరారు. అయితే.. నిందితుడి తరపు న్యాయవాది వాదిస్తూ.. ఉరిశిక్ష వల్ల అతని పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కోర్టుకు వివరించారు.

ఇదీ కేసు..

bihar man death sentence in gujarat: బిహార్‌కు చెందిన గుడ్డు యాదవ్.. తన భార్య, ఇద్దరు పిల్లలతో సూరత్​లోని పండేసర ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన తోటి వలస కార్మికుని కుమార్తెను నవంబర్ 4 రాత్రి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి.. ఆపై హత్య చేసి.. మృతదేహాన్ని ముళ్ల పొదల్లో పడేశాడు. నవంబర్ 7న ఆమె ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలోని ఫ్యాక్టరీ సమీపంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది.

సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. స్థానికుల సమాచారం ఆధారంగా.. నిందితుడిని నవంబర్ 8న అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.