సీఎం భూపేంద్ర..
- గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
- గాంధీనగర్‌లో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో నేతలంతా కలిసి పటేల్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు.
16:07 September 12
సీఎం భూపేంద్ర..
15:26 September 12
సమావేశం షురూ..
ముఖ్యమంత్రి ఎంపిక కోసం గాంధీనగర్‌లో భాజపా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మరికొద్ది సేపట్లో సీఎం ఎవరనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది.
13:26 September 12
గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరా అన్న ప్రశ్నకు కాసేపట్లో సమాధానం తెలిసిపోనుంది. భాజపా ఎమ్మెల్యేలు మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశమై.. ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. భాజపా అధిష్ఠానం పంపించిన పరిశీలకులు.. నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లద్ జోషి సమక్షంలో ఈ ప్రక్రియ జరగనుంది.
ఇందుకోసం ఆదివారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న తోమర్.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. అనంతరం మంత్రులు, నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
లక్కీ ఛాన్స్ ఎవరిదో?
లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రఫుల్ ఖోడా పటేల్ సీఎం రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాలా, మన్సుఖ్ మాడవీయ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఆర్సీ ఫాల్దూ సైతం పరిశీలనలో ఉన్నారు. వీరంతా పాటీదార్ వర్గానికే చెందినవారే కావడం గమనార్హం. వీరిలో ఎవరికి సీఎం పీఠం దక్కుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
గవర్నర్‌ను కలిసి..
నూతన సీఎంను ఎన్నుకొని గవర్నర్‌ను కలవనున్నట్లు భాజపా ప్రతినిధి యమల్ వ్యాస్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని గవర్నర్‌ను కోరనున్నట్లు వెల్లడించారు. ప్రమాణస్వీకారం తేదీ విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
09:39 September 12
గుజరాత్ సీఎం ఎంపిక లైవ్ అప్డేట్స్
గుజరాత్ కొత్త సీఎం వేట (Gujarat new CM) మొదలైంది. తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు భాజపా పరిశీలకుల హోదాలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, నరేంద్ర సింగ్ తోమర్ ఆ రాష్ట్రానికి చేరుకున్నారు. నేడు సమావేశం కానున్న పార్టీ శాసనసభాపక్షం కొత్త ముఖ్యమంత్రిని (Gujarat CM news) ఎన్నుకునే అవకాశముంది.
గాంధీనగర్‌కు వచ్చిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌తో కలిసి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్ నివాసానికి వెళ్లారు.
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆకస్మిక రాజీనామాతో మరో సీఎంను ఎంపిక చేయడం భాజపాకు అనివార్యమైంది. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే రూపానీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రూపానీ పనితీరుతో పాటు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని కొత్త వ్యక్తికి పాలనాపగ్గాలు అప్పగించాలని భాజపా నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: