గుజరాత్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. సగటున 60 శాతం ఓటింగ్ నమోదైంది. . రాష్ట్రంలోని 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కరోనా నిబంధనల మధ్య భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఓటిగ్ ఎక్కడెక్కడ? ఎంతెంత?
- 31 జిల్లా పంచాయతీల్లో 62.34 శాతం ఓటింగ్ నమోదు కాగా.. 231 తాలుకా పంచాయతీల్లో 63.23 శాతం ఓటింగ్ నమోదైంది. 81 మున్సిపాలిటీల్లో 54.82 శాతం ఓటింగ్ నమోదైంది.
- తాపి జిల్లాలోని వేరాలో అత్యధికంగా 70 శాతం ఓటింగ్ నమోదైంది.
- కచ్ జిల్లా గంధిధామ్లో అత్యల్పంగా 40 శాతం ఓటింగ్ నమోదైంది.
ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పోలిస్తే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ శాతం మెరుగైంది. ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు పెళ్లి చేసుకోబోయే ఓ జంట.. రాజ్‌కోట్‌లోని గోండల్ తాలుకాలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసింది. గాంధీనగర్‌లోని దెహ్గామ్ తాలుకాలోని పెళ్లి చేసుకున్న ఓ నవదంపతులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
తాపి జిల్లాలోని బుహారీలో మొదటి సారి ఓటు వేసేందుకు వచ్చిన వారికి పూలబొకేలతో అధికారులు స్వాగతం పలికారు. ఓటింగ్‌లో వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని ఆదర్శంగా నిలిచారు. జామ్‌నగర్ జిల్లాలని పిపర్టోడాలో ఓ 112 ఏళ్ల వృద్ధురాలు ఓటు వేశారు.
![Gujarat Civic Polls Average 60 percent voter turnout recorded](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10817553_222.jpg)
![Gujarat Civic Polls Average 60 percent voter turnout recorded](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10817553_11.jpg)
![Gujarat Civic Polls Average 60 percent voter turnout recorded](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10817553_211.jpg)
![Gujarat Civic Polls Average 60 percent voter turnout recorded](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10817553_333.jpg)
![Gujarat Civic Polls Average 60 percent voter turnout recorded](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10817553_223.jpg)
![Gujarat Civic Polls Average 60 percent voter turnout recorded](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10817553_77.jpg)
![Gujarat Civic Polls Average 60 percent voter turnout recorded](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10817553_999.jpeg)
మదర్ ఇండియా సినిమా నటి నర్గీస్.. సూరత్‌లోని బర్దోలీలో ఓటు వేశారు. చాలా మంది కరోనా వ్యాధిగ్రస్థులు.. పీపీఈ కిట్లు ధరించి ఓటింగ్‌లో పాల్గొన్నారు.
కేంద్ర పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పర్షోత్తమ్ రూపాలా.. అమ్రేలీ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భాజపా రాజ్యసభ సభ్యుడు జుగల్జీ ఠాకూర్.. మెహ్సానాలో ఓటు వేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,474 స్థానాలకు గానూ.. 36వేల పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. మార్చి 2న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.
ఇదీ చదవండి:'ప్రజల చెడు కర్మల ఫలితమే కరోనా వైరస్'