ETV Bharat / bharat

గుజరాత్​ వైపు 'తౌక్టే'- ముంబయిలో ఆరెంజ్ అలర్ట్ - tauktae in goa

'తౌక్టే' తుపాను ధాటికి తీర ప్రాంత రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఆదివారం కేరళ, గోవా, కర్ణాటకలో.. తుపాను బీభత్సం సృష్టించగా వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ప్రస్తుతం తౌక్టే గుజరాత్​ దిశగా వెళ్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు సూచించింది.

tauktae
తౌక్టే, గుజరాత్
author img

By

Published : May 17, 2021, 5:21 AM IST

Updated : May 17, 2021, 7:30 AM IST

దేశ పశ్చిమ తీరం ప్రకృతి వైపరీత్యం సుడిలో చిక్కుకొంది. కేరళ, కర్ణాటక, గోవా తీర ప్రాంతాలను తుడిచిపెట్టి, ఆరుగురు ప్రాణాలను హరించిన 'తౌక్టే' తుపాను ఆదివారం మరింతగా బలపడింది. 'అతి తీవ్ర తుపాను'గా మారి గుజరాత్‌ తీరంవైపు పయనిస్తున్నట్టు వాతావరణ విభాగం ప్రకటించింది. "ఇది ఉత్తర, వాయవ్య దిశగా పయనించి సోమవారం సాయంత్రానికి గుజరాత్‌ తీరాన్ని తాకనుంది. మంగళవారం తెల్లవారుజామున పోరుబందర్‌- మహువా (భావ్‌నగర్‌ జిల్లా)ల మధ్య తీరాన్ని దాటనుంది" అని వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయానికి తుపాను గంటకు 11 కి.మీ. వేగంతో ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన దీవ్‌, దమణ్‌లలో 'ఎల్లో అలర్ట్‌' ప్రకటించింది.

chikkamagaluru
చిక్క​మగళూరులో కూలిపోయిన విద్యుత్ స్తంభాలు
goa
గోవాలో ఎన్​డీఆర్ఎఫ్ బృందాలు

మంగళవారం నాటికి గాలుల వేగం గంటకు 150-160 కి.మీ.కు పెరుగుతుందని, గాలి దుమారం వేగం గంటకు 175 కి.మీ.గా ఉంటుందని తుపాను హెచ్చరికల విభాగం తెలిపింది. సోమవారం నాడు మహారాష్ట్ర తీరంలో గాలి వేగం గంటకు 65-75 కి.మీ. దుమారం వేగం గంటకు 85 కి.మీ. ఉంటుందని పేర్కొంది. ఇది క్రమేణా పెరిగి గుజరాత్‌వైపు పయనిస్తుందని వివరించింది. గుజరాత్‌లోని దేవభూమి ద్వారక, జామ్‌నగర్‌, భావ్‌నగర్‌ జిల్లాల్లో గాలి దుమారం తీవ్రత అధికంగా ఉండనుంది. జునాగఢ్‌ జిల్లాలో సముద్ర అలలు 3 మీటర్ల మేర ఎగిసిపడే ప్రమాదం ఉంది. దీవ్‌, గిర్‌సోమనాథ్‌, అమ్రేలీ, భరూచ్‌, భావ్‌నగర్‌, అహ్మదాబాద్‌, ఆనంద్‌, సూరత్‌లలో తీరప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. తౌక్టే దెబ్బకు కర్ణాటకలో నలుగురు, గోవాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కేరళను భారీ వానలు ముంచెత్తాయి. తుపాను పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షించారు. తగిన ముందస్తు సహాయ చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు.

భావ్‌నగర్‌కు తీవ్రమైన హెచ్చరికలు

గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లాకు తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. భారీ గాలుల కారణంగా ఈ జిల్లాలో మట్టి ఇళ్లు పూర్తిగా కూలిపోవచ్చని, కచ్చా, పక్కా ఇళ్లకు కూడా నష్టం జరగవచ్చని అధికారులు తెలిపారు. చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయి విద్యుత్తు, సమాచార రంగాలకు అంతరాయం కలిగే ప్రమాదముంది. రైళ్ల మార్గాలతో పాటు, రహదారులపై నీరు చేరి రాకపోకలు నిలిచిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ప్రాణ నష్టం జరకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికార్లను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా ఓఖా-పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైలును రద్దు చేశారు.

taukte in gujarat
తీర ప్రాంతవాసులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న సిబ్బంది

సురక్షిత ప్రాంతాలకు లక్షన్నర మంది

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లక్షన్నర మందిని ముందు జాగ్రత్త చర్యగా గుజరాత్‌ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రాష్ట్రంలో 44 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు 10 రాష్ట్ర బృందాల జవాన్లు కూడా సంసిద్ధంగా ఉన్నారు. అవసరమైతే సైన్యం కూడా రంగంలో దిగనుంది.

taukte in gujarat
గుజరాత్​లో తౌక్టే ప్రభావం

1500 ఆసుపత్రుల్లో ఏర్పాట్లు

గుజరాత్‌లోని సుమారు 1500 ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్సలు జరుగుతున్నాయి. తుపాను కారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్‌ సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. తగినంత ప్రాణవాయువును నిల్వ చేసింది. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసింది. సోమ, మంగళవారాల్లో టీకా కార్యక్రమా లను రద్దు చేసింది. రాష్ట్రంలోని ఎనిమిది ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల్లో తయారీకి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

మహారాష్ట్రలో నేడు కుంభవృష్టి

మహారాష్ట్రలో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయ్‌గడ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తర కొంకణ్‌, ముంబయి, ఠాణె, పాల్ఘాడ్‌లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే వీలుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదేశాల మేరకు ముంబయిలోని ఓ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లోని 580 మంది కరోనా రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

pune
పుణెలో ధ్వంసమైన ఇళ్లు

కర్ణాటకలో నలుగురి మృతి

కర్ణాటకలో ఆదివారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కన్నడ జిల్లాలో తన పడవను కట్టడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని మరో పడవ వచ్చి ఢీకొనడంతో ఆయన మరణించాడు. పిడుగుపాటు, విద్యుదాఘాతం, ఇల్లు కూలిన దుర్ఘటనల్లో మిగిలిన ముగ్గురు మృతి చెందారు. ఏడు జిల్లాల్లోని 98 గ్రామాలు తుపాను ప్రభావానికి గురయ్యాయి. 70-80 కి.మీ.వేగంతో గాలులు వీచాయి. ఉడుపి జిల్లాలోని నాడలో 385 మి.మీ. వర్షపాతం నమోదయింది. ముఖ్యమంత్రి యడియూరప్ప పరిస్థితులను సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని ఇన్‌ఛార్జి మంత్రులను ఆదేశించారు. సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించారని తెలిపారు. అత్యవసరమైతే మంత్రులకు నేరుగా ఫోన్‌ చేయాలని అధికారులకు సూచించారు. రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, మూడు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సేవలు అందిస్తున్నట్టు రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు.

గోవాలో ఇద్దరు బలి

గోవాలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా శనివారం రాత్రి నుంచే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు వేరువేరు సంఘటనల్లో ఇద్దరు మరణించినట్టు ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ చెప్పారు. గోవా వైద్య కళాశాల ఆసుపత్రిలో 15 నిమిషాల పాటు విద్యుత్తు నిలిచిపోయింది. అయితే ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం కలగలేదు. శనివారమే కొత్తగా క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం.

కేరళను వీడని భారీ వర్షాలు

కేరళలోని ఎర్నాకుళం, ఇడుక్కి, మల్లాపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సముద్రం పొంగడంతో చాలా చోట్ల వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఈ మూడు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్‌ అలెర్ట్‌’ను ప్రకటించింది. దీనర్థం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. చలకుడి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఆనకట్టలు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. సముద్ర అలల తాకిడికి అల్లాడిన ఎర్నాకుళం జిల్లాలోని చెల్లానం గ్రామాన్ని భారత నౌకాదళం ఆదుకొంది. నీటిలో చిక్కుకున్న ఆ గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ సందర్భంగా జవాన్లు ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించారు.

రాళ్లలో చిక్కుకున్న టగ్‌

bhatkala
భట్కళ సమీపంలో సహాయక చర్యలు

ఒడ్డుకు చేరాల్సిన ఓ టగ్‌ తుపాను కారణంగా రాళ్లలో చిక్కుకుంది. కర్ణాటకలోని ఉడుపి సమీపంలోని కాపు తీరం వద్ద ఆదివారం ఈ సంఘటన చేటుచేసుకుంది. రేవుల్లో భారీ నౌకల్ని ఒడ్డుకు చేర్చేందుకు టగ్‌లను ఉపయోగిస్తుంటారు. తుపాను కారణంగా దారి తప్పి రాళ్లను ఢీకొట్టి ఇరుక్కొంది. ఇందులోని తొమ్మిది మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తామున్న పరిస్థితిని వివరిస్తూ వీడియో సందేశాన్ని గస్తీదళానికి పంపారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఉన్నందున అక్కడకు చేరుకునేందుకు ఇబ్బందిగా ఉన్నట్లు గస్తీదళానికి చెందిన డీఐజీ ఎస్‌.బి.వెంకటేశ్‌ తెలిపారు. శనివారం కూడా ఓ టగ్‌ ప్రమాదంలో చిక్కుకొంది. ఇందులో ఒకరు మృతి చెందగా, అయిదుగురు గల్లంతయ్యారు. కుంభవృష్టి కురుస్తుండడంతో అధికారులు ఉత్తర కన్నడ జిల్లా భట్కళ తాలూకాలోని జాలి పట్టణ పంచాయతీ పరిధిని ప్రమాదకర ప్రాంతం (డేంజర్‌ జోన్‌)గా ప్రకటించారు.

mangaluru
మంగళూరు సమీపంలోని సూరాత్కల్ బీచ్ వద్ద

తౌక్టే అంటే పెద్ద శబ్దం చేసే బల్లి

భారత్‌లో ఈ ఏడాది వచ్చిన మొదటి తుపాను తౌక్టే. దీని కారణంగా తీర ప్రాంత రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తౌక్టే అనే పేరును మయన్మార్‌ పెట్టింది. బర్మీస్‌ భాషలో తౌక్టే అంటే.. పెద్దగా శబ్దం చేసే బల్లి. చీకట్లోనూ చూడగలదు. ప్రస్తావించడంలో, గుర్తు పెట్టుకోవడంలో సౌలభ్యం కోసం బంగ్లాదేశ్‌, భారత్‌, మాల్దీవులు, మయన్మార్‌, ఒమన్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు తమ దేశాలను తాకిన తుపాన్లకు పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మయన్మార్‌ పెట్టిన పేరును ఈ తుపానుకు ఇచ్చారు. గతేడాది వచ్చిన అంఫన్‌ తుపాను పేరును థాయ్‌లాండ్‌ సూచించింది.

అమిత్‌ షా సమీక్ష

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తుపాను ప్రభావిత రాష్ట్రాలైన గుజరాత్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో సమీక్ష జరిపారు. ఇంతవరకు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలపై ఆరా తీశారు. కేంద్రపాలిత ప్రాంతాలైన దమణ్‌ దీవ్‌, దాద్రానగర్‌ హవేలీ అధికారులు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. కొవిడ్‌ బాధితులు, ఆక్సిజన్‌ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని సూచించారు. ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్ల భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. 24 గంటలూ పనిచేసే కంట్రోలు రూం ఏర్పాటు చేసినట్టు వివరించారు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత వాయుసేన 16 రవాణా విమానాలు, 18 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచింది.

ఇదీ చదవండి:

అతి తీవ్ర తుపానుగా 'తౌక్టే'- ఆ రాష్ట్రాల్లో హైఅలర్ట్​

'తౌక్టే' బీభత్సం- కర్ణాటకలో నలుగురు మృతి

Last Updated : May 17, 2021, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.