మన జాతీయ గీతం పాడాలంటేనే కొందరు తడబడుతుంటారు. అలాంటిది ఏకంగా 91 దేశాల జాతీయ గీతాలను కంఠతా పాడుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు గుజరాత్‌లోని వడోదరకు చెందిన అధర్వ అమిత్ మూలే.
ఖతార్, సిరియా, థాయ్‌లాండ్, యెమెన్, న్యూజిలాండ్ సహా 69 దేశాల జాతీయ గీతాలు పాడి.. ఈ ఏడాది మార్చి 6న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు అధర్వ. జులై 1 నాటికి 91 దేశాల జాతీయ గీతాలపై పట్టు సంపాదించాడు ఈ 18 ఏళ్ల కుర్రాడు.
"పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, జపాన్, యూకే సహా 91 దేశాల జాతీయ గీతాలను పాడగలను. వసుదైక కుటుంబం అనే సిద్ధాంతాన్ని మనం విశ్వసిస్తాం. అందుకే అన్ని దేశాల జాతీయ గీతాలను గుర్తుపెట్టుకోవాలని నిర్ణయించుకున్నా."
-అథర్వ అమిత్
సంగీతంలోనూ దిట్ట..
సంప్రదాయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టాడు అధర్వ. ప్రస్తుతం కర్ణాటక సంగీతంతో పాటు వీణ వాయించడం నేర్చుకుంటున్నాడు. ఇప్పటికే జపనీస్, రష్యన్, తమిళం, కన్నడ సహా పలు భాషల్లో ప్రావీణ్యం సాధించాడు.
ఇదీ చూడండి: పాదాలతోనే అద్భుత చిత్రాలు.. దివ్యాంగుడి ప్రతిభ