ETV Bharat / bharat

గుజరాత్​ నుంచి తిరుమలకు పాదయాత్ర.. 70+ ఏజ్​లో...

గుజరాత్‌లోని ద్వారక నుంచి తిరుమలకు మధ్య దూరం దాదాపు 2 వేల 200 కిలోమీటర్లు. ఈ రెండు నగరాల మధ్య దూరాన్ని కాలినడకతో చెరిపేయాలనుకుంటే సాహసమే అవుతుంది. అదీ ముదిమి వయస్సులో పూనుకుంటే! ఓ రకంగా అసాధ్యమే. కానీ సుసాధ్యం చేస్తోంది.. గుజరాత్‌కు చెందిన ఓ మిథునం. అసలు ఆ జంట ఈ మహాపాదయాత్ర ఎందుకు చేపట్టింది? ఏ విశ్వాసం వాళ్లను ఈ వయస్సులో ఇంత సాహసానికి ఒడిగట్టేలా చేసింది?

gujarat to tirupati walk elderly couple
ఏడుపదుల వయస్సులో గుజరాత్​ నుంచి పాదయాత్ర!
author img

By

Published : Aug 10, 2021, 3:26 PM IST

Updated : Aug 10, 2021, 4:08 PM IST

గుజరాత్​ నుంచి తిరుమలకు వృద్ధ దంపతుల పాదయాత్ర

తిరుమల కొండలపై వెలిసిన శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా భాసిల్లుతున్నారు. ఆ శ్రీవారిని కొలిచినంతనే మొక్కులు తీర్చుతారని భక్తుల విశ్వాసం. అందుకే దక్షిణ భారతంలోనే కాక ప్రపంచం నలుమూలలా ఆ బాలాజీ భక్తులు కనిపిస్తుంటారు. ఈ ప్రమోద్ దంపతులు కూడా ఆ శ్రీనివాసుడి భక్తులే.

gujarat to tirupati walk elderly couple
ప్రమోద్​ దంపతులు
gujarat to tirupati walk elderly couple
స్థానికులతో ప్రమోద్​ దంపతులు

వీళ్ల స్వస్థలం.. గుజరాత్‌ ద్వారక సమీపంలోని ఓ గ్రామం. ప్రమోద్ వయస్సు.. 75 ఏళ్లు. ఆయన సతీమణి వయస్సు కూడా 70కి పైనే. ఈ వయస్సులో వీళ్లు.. గుజరాత్ ద్వారక నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాలినడకన 3 నెలల క్రితం అంటే 90 రోజుల క్రితం బయలుదేరారు. ఓ తోపుడు బండిపై వాళ్లకు అవసరమైన సామగ్రిని పెట్టుకొని దాన్ని తోసుకుంటూ ముందుకు సాగిపోతుంటే.. ఆయనతో పాటే సహధర్మచారిణి కూడా చేతికర్ర సాయంతో నడిచి వస్తున్నారు. ఇలా రోజుకు కొంత దూరం నడుస్తూ దాదాపు 16 వందల కిలోమీటర్ల దూరాన్ని కరిగించేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని రాయచూర్ చేరుకున్నారు. మరో 500 కిలోమీటర్ల పైన ప్రయాణాన్ని సాగించాల్సి ఉంది.

అసలు ఈ మిథునం.. ఈ వయస్సులో ఈ సాహసానికి పూనుకోవడానికి కారణం ఏంటో వారి మాటల్లోనే విందాం.

కొన్నాళ్ల క్రితం అనారోగ్యం కారణంగా నాకు కంటి సమస్యలు తలెత్తాయి. అప్పుడు.. నా భార్య శ్రీవారికి మొక్కుకుంది. నాకు నయమైతే.. తిరుమలకు నడుచుకుంటూ వస్తామని. నేను కోలుకున్నాను. గుజరాత్‌లోని ద్వారక నుంచి తిరుమలకు 2,219 కిలోమీటర్ల దూరం ఉంది. రోజూ సరాసరిన 25 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నాం.

-ప్రమోద్‌, శ్రీవారి భక్తుడు, ద్వారక

శ్రీవారిపై భక్తితో పశ్చిమ భారతాన్ని దక్షిణ భారతాన్ని.. మహా పాదయాత్రతో ఏకం చేసేందుకు పూనుకున్న ఈ మిథునం మరో నెల రోజుల్లో గోవిందుడ్ని దర్శించుకుంటామని భక్తి పారవశ్యంతో చెబుతోంది.

ఇదీ చదవండి : లీటరు పాలు రూ.10వేలు- ఎక్కడో తెలుసా?

Last Updated : Aug 10, 2021, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.