గుజరాత్ భుజ్ బెటాలియన్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) కానిస్టేబుల్‌ను గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్)(Gujarat Anti Terrorism Squad) అరెస్టు చేసింది. పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడ్ని జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాకు చెందిన మహమ్మద్ సజ్జద్గా అధికారులు గుర్తించారు. భుజ్‌లోని బీఎస్ఎఫ్ 74వ బెటాలియన్‌లో ఈ ఏడాది జులైలో అతడు నియమితుడయ్యాడని చెప్పారు.

"సజ్జద్ 2012లో కానిస్టేబుల్‌గా బీఎస్ఎఫ్లో చేరాడు. పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని అందించడం వల్ల అతని సోదరుడు వాజిద్, సహోద్యోగి ఇక్బాల్ రషీద్ ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. జమ్మూలో రీజినల్ పాస్‌పోర్టును అతడు తీసుకున్నాడు. దానితో 2011 డిసెంబరు 1, 2012 జనవరి 16 మధ్య 46 రోజుల పాటు పాక్‌లో పర్యటించాడు. అటారీ రైల్వే స్టేషన్ నుంచి సమ్జౌతా ఎక్స్‌ప్రెస్‌లో అతడు పాకిస్థాన్‌కు వెళ్లాడు."
-గుజరాత్ ఏటీఎస్
వాట్సాప్ ద్వారా రహస్య సమాచారాన్ని సజ్జద్.. పాక్‌కు చేరవేశాడని ఏటీఎస్ తెలిపింది. అంతేగాకుండా తప్పుడు జన్మ ధ్రువీకరణ పత్రం సమర్పించి బీఎస్ఎఫ్ను తప్పుదోవ పట్టించాడని చెప్పింది. ఆధార్ కార్డు ప్రకారం సజ్జద్ 1992 జనవరి 1న జన్మించినట్లు ఉండగా.. పాస్‌పోర్టు ప్రకారం అతడు 1985 జనవరి 30న పుట్టినట్లుగా ఉందని పేర్కొంది.
సజ్జద్ వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, వాటి సిమ్‌కార్డులతో పాటు, మరో రెండు సిమ్‌కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: భారత్-పాక్ మ్యాచ్‌లో ఓటమిపై విద్యార్థుల ఫైట్