ETV Bharat / bharat

గోద్రాలో భాజపాను గద్దె దించిన మజ్లిస్ పార్టీ - Godhra municipality AIMIM support to 17 Independents form the board

గోద్రా మున్సిపాలిటీలో భాజపాను అధికారానికి దూరం చేసింది ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ. ఇక్కడ గెలుపొందిన ఏడుగురు సభ్యులతో స్వతంత్రులకు మద్దతిచ్చి, వారు అధికార పగ్గాలు చేపట్టేలా చేసింది. దీంతో.. 2002 తర్వాత తొలిసారి ఈ మున్సిపాలిటీని భాజపా కోల్పోయినట్లైంది.

Gujarat: AIMIM backs Independents, denies BJP power in Godhra
గోద్రాలో భాజపాకు షాక్- అధికారంలోకి ఎంఐఎం!
author img

By

Published : Mar 18, 2021, 10:49 AM IST

Updated : Mar 18, 2021, 1:42 PM IST

గోద్రా మున్సిపాలిటీలో భాజపా అధికారంలోకి రాకుండా మజ్లిస్ పార్టీ అడ్డుపడింది. స్వతంత్రులకు.. తమ పార్టీ నుంచి గెలిచిన ఏడుగురు సభ్యుల మద్దతు ఉంటుందని ప్రకటించింది. దీంతో 2002 నుంచి ఇక్కడ అధికారంలో ఉన్న భాజపా.. పీఠానికి దూరమైంది.

గోద్రా మున్సిపాలిటీలో 44 స్థానాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 18 స్థానాలను భాజపా గెలుచుకుంది. తొలిసారి బరిలోకి దిగిన ఎంఐఎం ఏడు చోట్ల విజయం సాధించింది. 17 మంది స్వతంత్రులు గెలుపొందారు. స్వతంత్రుల బృందానికి మద్దతు ప్రకటించడం వల్ల పీఠం చేజిక్కించుకునేందుకు భాజపాకు దారులు మూసుకుపోయాయి.

'భాజపాను అడ్డుకున్నాం'

తమ మద్దతుతో స్వతంత్రులకు అధికారం చేపట్టేందుకు కావాల్సిన ఆధిక్యం లభించిందని ఎంఐఎం గుజరాత్ చీఫ్ సాబిర్ కబ్లివాలా తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులు సంజయ్ సోనీని అధ్యక్షుడిగా, అక్రమ్ పటేల్​ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

"గోద్రాలో భాజపా అధికారంలోకి రాకుండా విజయవంతంగా అడ్డుకున్నాం. ప్రజలు మాకు(మజ్లిస్ పార్టీకి) ఓటేశారు. మేం వారి కోసం పనిచేస్తాం. గోద్రా ప్రజలు భాజపా పాలన పట్ల విసుగుచెందారు."

-సాబిర్ కబ్లివాలా, ఎంఐఎం గుజరాత్ అధ్యక్షుడు

అసెంబ్లీ ఎన్నికలకు సైతం కసరత్తు ప్రారంభించినట్లు సాబిర్ తెలిపారు. మజ్లిస్ పార్టీకి, అసదుద్దీన్ ఒవైసీకి ఉన్న ఆదరణతో తప్పక రాణిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2022లో జరగనున్నాయి.

ఇదీ చదవండి: గుజరాత్​ స్థానిక పోరులో కమలం హవా- 42 చోట్ల ఆప్​

Last Updated : Mar 18, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.