ETV Bharat / bharat

కాంగ్రెస్ ఎమ్మెల్యే, ముగ్గురు కొడుకులకు ఏడాది జైలు

2008 దాడి కేసులో ఓ కాంగ్రెస్​ ఎమ్మెల్యేకు గుజరాత్​ కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ఓ కుటుంబంపై దాడి చేసినందుకు ఆయనతో పాటు ముగ్గురు కుమారులకూ శిక్ష పడింది.

Guj: Cong MLA, sons get one yr jail term in 2008 attack case
కాంగ్రెస్ ఎమ్మెల్యే, ముగ్గురు కొడుకులకు ఏడాది జైలు
author img

By

Published : Feb 21, 2021, 7:18 AM IST

గుజరాత్​లో కాంగ్రెస్ ఎమ్మెల్యే భీఖాభాయ్ జోషి సహా ఆయన ముగ్గురు కుమారులకు మెజిస్ట్రేట్​ కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 2008లో పంచాయతీ ఎన్నికల వివాదంలో ఓ కుటుంటంలోని ముగ్గురు వ్యక్తులపై దాడి కేసులో ఈ మేరకు శనివారం తీర్పునిచ్చింది.

జోషి ముగ్గురు కుమారులు భరత్, మనోజ్, జయంతిలకు ఏడాది జైలుతో పాటు రూ.5వేల జరిమానా విధించింది కోర్టు. అయితే వారికి ఆ తర్వాత బెయిలు మంజూరైంది.

ఇదీ జరిగింది..

2008 నవంబర్​ 4న భీఖాభాయ్​ తన కొడుకులతో కలిసి ముగర్​భాయ్ జునేజా కుటుంబంపై దాడి చేశారు. ఆమ్రపుర్​ గ్రామంలోని బాధితుని ఇంటికి వెళ్లి కత్తులు, పైపులు, చాకులతో గాయపరిచారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన వివాదంతోనే ఈ దాడికి తెగబడ్డారని కోర్టు తెలిపింది.

ఇదీ చూడండి: భాజపా-కాంగ్రెస్​ కార్యకర్తల బాహాబాహీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.