భారత్- పాక్ సరిహద్దుల్లో(India Pak border news) దీపావళిని సైనికులు ఘనంగా జరుపుకున్నారు. ఇరు దేశాల సైనికులు ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. పంజాబ్‌లోని అమృత్సర్ దగ్గర ఉండే అట్టారీ- వాఘా సరిహద్దు(Wagah border news) వద్ద పాక్ రేంజర్స్‌కు భారత జవాన్లు మిఠాయిలు పంచి పెట్టారు.



కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న టీట్వాల్ సరిహద్దులో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. సరిహద్దు ఒంతెనపైనే భారత్- పాక్(India Pak border news) జవాన్లు ఒకరికొకరు స్వీట్లు పంచుకుని దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.


గుజరాత్‌లోని సరిహద్దుతోపాటు, రాజస్థాన్‌లోని బాడ్మేర్ సరిహద్దుల్లోనూ(Barmer news) భారత్- పాక్ ఆర్మీ(India Pak border news) దీపావళి సంబరాలు చేసుకున్నారు. పాక్ ఆర్మీకి భారత సైనికులు మిఠాయిలు పంచారు.
ఇదీ చూడండి: 'మీరే నా కుటుంబసభ్యులు'.. జవాన్లతో కలిసి మోదీ దీపావళి వేడుకలు