ETV Bharat / bharat

కాసేపట్లో పెళ్లి.. వరుడ్ని చితకబాదిన వధువు కుటుంబం

Groom Beaten Up: పెళ్లివేడుకలో వరుడిని చితకబాదారు వధువు కుటుంబసభ్యులు. అతడి గుట్టు బయటపడటమే ఇందుకు కారణం. నిందితుడు హుసైన్​ ఇప్పటికే అనేక మందిని వివాహం చేసుకున్నాడని వధువు తరపు వారు ఆరోపించారు.

ghaziabad
గాజియాబాద్​
author img

By

Published : Dec 18, 2021, 1:39 PM IST

వరుడిపై దాడి చేసిన వధువు కుటుంబీకులు

Groom Beaten Up: మరికాసేపట్లో పెళ్లి అనగా వధువు తరపు వాళ్లను రూ.10 లక్షలు కట్నం డిమాండ్​ చేశారు వరుడి కుటుంబీకులు. వధువు తరపు వారి నుంచి డబ్బులు వస్తాయి అనుకుంటే సీన్​ రివర్స్ అయింది. అమ్మాయి తరపు బంధువులు, అతిథులు వరుడిపై దాడికి దిగారు. అందరూ కలిసి చితకబాదారు​. కానీ అది కట్నం అడిగినందుకు కాదు. వరుడికి ఇదివరకే చాలా పెళ్లిళ్లు అయ్యాయని తెలియడం వల్ల. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్ అయింది.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాకు చెందిన నిందితుడు ముజమ్మిల్​ హుసైన్​కు దిల్లీకి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. గాజియాబాద్​​ జిల్లా మోహన్​నగర్​లో శుక్రవారం వివాహ వేడుకలను నిర్వహించారు బంధువులు. మరికాసేపట్లో పెళ్లి అనగా రూ.10 లక్షల కట్నం అడిగారు హుసైన్​ తరఫు వారు. అదే సమయంలో వధువు కుటుంబీకులకు హుసైన్​కు ఇదివరకే వివాహం జరిగిందన్న విషయం తెలిసింది. దీంతో ఆగ్రహం చెందిన వధువు తరపు వారు పెళ్లికొడుకుపై దాడికి దిగారు.

సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హుసైన్​ పెళ్లి వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన అతడి తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబసభ్యులు మరో యువతిని వివాహం చేసుకున్నట్లుగా ఉన్న హుసైన్​ పెళ్లి ఫొటోను పోలీసులకు అందించారు. నిందితుడు అనేకమందిని వివాహం చేసుకున్నాడని ఆరోపించారు.

ఇదీ చూడండి : చలిపులి.. వణుకుతున్న ఉత్తర భారతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.