అమెరికా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా నేడు బాధ్యతలు చేపట్టబోయే బైడెన్, కమలా హారిస్‌లకు సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పంతో శుభాకాంక్షలు తెలిపారు.
14 టన్నుల ఇసుకతో నిర్మించిన ఈ సైకత శిల్పం.. బైడెన్, కమలా హారిస్ చిత్రాలతో పాటు అమెరికా జాతీయ జెండా, వైట్ హౌస్‌ను ప్రతిబింబిస్తోంది. భారత్ అమెరికాల మధ్య బంధం బలపడాలని ఆశిస్తూ 20 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పుతో ఈ సైకత శిల్పాన్ని నిర్మించారు సుదర్శన్ పట్నాయక్.
ఇదీ చూడండి: 23 అరుదైన రాబందుల మృతి- కారణమిదే!