పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభంకానుండగా.. తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 'కొంతమంది' రైతులు మాత్రమే నిరసనలు తెలుపుతున్నారని.. అందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది.
ఇప్పటికే సోమవారం సభా కార్యకలాపాల జాబితాలో బిల్లును చేర్చిన కేంద్రం.. ఆ రోజే ఆమోదం తెలిపే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. లోక్‌సభలో సాగుచట్టాల రద్దు బిల్లు ప్రవేశ పెట్టనున్నారు.
ఈనెల 19న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ 3 సాగు చట్టాలను రద్దు (modi on farmers law) చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రకటనకు అనుగుణంగా అధికారులు వేగంగా ఈ బిల్లు రూపొందించారు.
ఈనెల 24న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం మూడు వ్యవసాయ చట్టాల రద్దు (Farm Bill Repeal) బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు నేపథ్యంలో లోక్‌సభకు చెందిన ఎంపీలంతా సోమవారం హాజరుకావాలని భాజపా విప్ జారీ చేసింది.
ఈ నెల 29న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న రోజునే సాగు చట్టాలను ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించడం వల్ల ఆరోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని వాయిదా(Faremrs tractor rally suspended) వేస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)(Samyukta kisan morcha) తెలిపింది.
ఇదీ చూడండి: కాంగ్రెస్కు టీఎంసీ ఝలక్- విపక్షాల భేటీకి దూరం