కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ.. కేబినెట్ కమిటీలలో మార్పులు చేర్పులు చేశారు. కీలక కమిటీలలో కొత్త మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, శర్బానంద సోనోవాల్‌లకు స్థానం కల్పించారు.
కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, భూపేంద్ర యాదవ్, శర్బానంద సోనోవాల్‌లకు.. ప్రధాని అధ్యక్షుడిగా ఉండే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీలో చోటు దక్కింది. కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్‌లకు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో స్థానం దక్కింది. నారాయణ్ రానే, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్‌లకు.. పెట్టుబడులు, వృద్ధి కేబినెట్ కమిటీలో చోటు దక్కింది. ఉద్యోగం, నైపుణ్యాభివృద్ధి కమిటీలో మంత్రులు కిషన్‌రెడ్డి, ఆర్సీపీ సింగ్, భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్‌లకు చోటు కల్పించారు.
ఇదీ చదవండి : ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం