రైతులతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. అయితే.. సాగు చట్టాల రద్దు.. కాకుండా వాటికి ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు సాగాలని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఎప్పుడూ రైతుల సంక్షేమం కోసమే ప్రయత్నిస్తుందన్నారు.
" కేంద్రం ఎల్లప్పుడూ రైతుల సంక్షేమం కోసమే ఆలోచిస్తుంది. సాగు చట్టాలు కాకుండా ఇతర విషయాలపై అన్నదాతలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. మధ్యప్రదేశ్లో భాజపాకు సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. సీఎంను మార్చే అవకాశం లేదు."
- నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. గతేడాది నవంబర్ నుంచి రైతులు ఉద్యమిస్తున్నారు.
ఇదీ చదవండి : దేశంలోని యువ రచయితలకు మోదీ పిలుపు