ఉపాధి అవకాశాలు కల్పించకుండా పట్టభద్రులను కేంద్రం శిక్షిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రముఖ విద్యా సంస్థల్లో అధ్యాపక పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఈమేరకు ట్వీట్ చేశారు.
-
Educated youth is facing severe joblessness.
— Rahul Gandhi (@RahulGandhi) March 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
It seems GOI is penalising them, esp. OBC-SC-ST candidates, for having real degrees! pic.twitter.com/nyiUStdgtD
">Educated youth is facing severe joblessness.
— Rahul Gandhi (@RahulGandhi) March 17, 2021
It seems GOI is penalising them, esp. OBC-SC-ST candidates, for having real degrees! pic.twitter.com/nyiUStdgtDEducated youth is facing severe joblessness.
— Rahul Gandhi (@RahulGandhi) March 17, 2021
It seems GOI is penalising them, esp. OBC-SC-ST candidates, for having real degrees! pic.twitter.com/nyiUStdgtD
ఐఐటీ సహా పలు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో భర్తీ కానీ అధ్యాపకుల పోస్టుల వివరాలను బుధవారం ట్విట్టర్లో షేర్ చేశారు రాహుల్. పట్టభద్రులైన యువతపై.. ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. నిజమైన డిగ్రీలు ఉన్న కారణంగానే కేంద్రం వారిపై ఈ వైఖరి ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు.
ఇదివరకు.. పలువురు భాజపా నేతల విద్యార్హతలపై కాంగ్రెస్ సందేహాలను వ్యక్తం చేసింది. కొందరు బోగస్ డిగ్రీ పట్టాలు పొందారని ఆరోపించింది. అదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి : భాజపా ఎంపీ రామ్ స్వరూప్ ఆత్మహత్య!