ETV Bharat / bharat

'కేంద్రం వృథా చర్చలతో దేశ భద్రతకు ముప్పు' - చైనాతో చర్చలు వ్యర్థమన్న రాహుల్​

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల దేశ భద్రత ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. చైనాతో చర్చలను వ్యర్థమైనవిగా పేర్కొన్నారు. మరోవైపు, చైనాతో సైనిక చర్చలు ఎందుకు ఫలప్రదం కాలేదో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్​ సీనియర్ నేత అజయ్ మాకన్.

Congress
కాంగ్రెస్​
author img

By

Published : Apr 19, 2021, 10:35 AM IST

Updated : Apr 19, 2021, 12:34 PM IST

కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్లే భారత జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ విమర్శించారు. చైనాతో కేంద్రం జరిపే చర్చలను వ్యర్థమైనవిగా పేర్కొన్నారు. హాట్​స్ప్రింగ్స్, గోగ్రా, దెస్పాంగ్​లోని భూభాగాలను చైనా ఆక్రమించడం.. డీబీఓ వైమానిక స్థావరానికి, దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. సరిహద్దుల్లో చైనా బలగాలు వెనుదిరగడానికి నిరాకరించయన్న వార్తల అనంతరం రాహుల్​ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

ఎందుకు ఫలప్రదం కాలేదు?

తూర్పు లద్దాఖ్​లోని సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై చైనాతో జరిపిన చర్చలు ఎందుకు ఫలించలేదో ప్రభుత్వం చెప్పాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. హాట్​స్ప్రింగ్, గోగ్రా, దెస్పాంగ్​ నుంచి వెనుదిరిగేందుకు చైనా బలగాలు నిరాకరించాయన్న వార్తా కథనాన్ని ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు ఆ పార్టీ అధికార ప్రతినిధి అజయ్​ మాకన్​.

"గోగ్రా, దెస్పాంగ్​ సహా ఇతర ఉద్రిక్త ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై చర్చలు ఎందుకు ఫలించలేదు. గల్వాన్​ లోయలో పాయింట్​-14 సహా ఇతర ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించాలనే ప్రభుత్వ నిర్ణయం భారత్​కు అనుకూలమేనా? ఈ ప్రాంతాల్లో ఏప్రిల్​ 20కి ముందున్న యథాతథ స్థితిని ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు."

-అజయ్​ మాకన్, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

సైనిక చర్చలు విఫలమైన తర్వాత చైనా నుంచి భారత భూభాగాలను రాబట్టుకోవడానికి మోదీ ప్రభుత్వం ఏ ప్రణాళికను అనుసరిస్తోందో చెప్పాలని అజయ్ మాకన్​ డిమాండ్ చేశారు. చర్చల తర్వాత కూడా.. సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి ముందడుగు పడలేదని అన్నారు.

ఇదీ చదవండి: కేంద్ర వర్సిటీల సంస్కరణల మార్గం

ఇదీ చదవండి: ఆసక్తి రేకెత్తించిన కేంద్ర మంత్రి ట్వీట్‌!

Last Updated : Apr 19, 2021, 12:34 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.