ETV Bharat / bharat

18 ఏళ్లు దాటిన వారందరికీ కొవిడ్ టీకా బూస్టర్ డోస్! - కొవిడ్​ ప్రికాషనరీ డోస్

Booster Dose in India: దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకా బూస్టర్​ డోసులు అందించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి ప్రికాషనరీ డోసుల పేరుతో మూడో డోసును కేంద్రం పంపిణీ చేస్తోంది.

Booster Dose in India
కొవిడ్​ వ్యాక్సినేషన్
author img

By

Published : Mar 21, 2022, 5:34 PM IST

Updated : Mar 21, 2022, 5:53 PM IST

Booster Dose in India: చైనా సహా పలు దేశాల్లో మరోసారి కరోనా విజృంభణ మొదలైన నేపథ్యంలో దేశంలో 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్​ డోసును అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెల్త్​కేర్​, ఫ్రంట్​లైన్​ వర్కర్లు సహా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రికాషనరీ డోసులు అందుబాటులో ఉన్నాయి.

రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాతే బూస్టర్​ డోసు తీసుకోవాలని కేంద్రం ఇదివరకు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 10న అర్హులైన వారికి బూస్టర్​ డోసు పంపిణీని ప్రారంభించింది. ఇప్పటికీ వరకు 2,05,89,099 ప్రికాషనరీ డోసులను పంపిణీ చేసింది.

మరోవైపు 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని మొదలుపెట్టింది కేంద్రం. ఈనెల 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్​లో ఇప్పటివరకు 34,72,201 డోసులను కేంద్రం అందించింది. దేశవ్యాప్తంగా ఆదివారం మరో 2,97,285 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,81,24,97,303కు పెరిగింది.

ఇదీ చూడండి : దేశంలో కొత్తగా 1,549 కరోనా కేసులు.. 31 మరణాలు

Last Updated : Mar 21, 2022, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.