ETV Bharat / bharat

'మేరా ​​​​​​రేషన్‌' మొబైల్ యాప్ ఆవిష్కరణ - public distribution system

మేరా రేషన్​ పేరుతో కేంద్రం కొత్త యాప్​ను ప్రవేశ పెట్టింది. ఈ యాప్​తో పీడీఎస్​ ద్వారా రేషన్ పొందుతున్న వారు దగ్గరలోని రేషన్ దుకాణం పేరు, లభించే సరకులు మొదలైన వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా 'వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌' కార్డు కింద రేషన్‌ కార్డు పోర్టబులిటీని కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ration
​​​​​​రేషన్‌కార్డుదారుల కోసం కొత్త యాప్‌
author img

By

Published : Mar 13, 2021, 5:41 AM IST

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా రేషన్‌ సరకులు పొందుతున్న లబ్ధిదారుల కోసం కేంద్రం కొత్త యాప్‌ను విడుదల చేసింది. 'మేరా రేషన్‌' పేరిట తీసుకొచ్చిన ఈ యాప్‌ ద్వారా కార్డుదారులు దగ్గర్లోని రేషన్‌ దుకాణం పేరు, లభించే సరకులు, ఇటీవల జరిపిన లావాదేవీలు వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

ముఖ్యంగా సొంత ప్రదేశం నుంచి కొత్త ప్రదేశానికి వలస వెళ్లే వారికి ఈ యాప్‌ ఎంతగానో ఉపయోపడుతుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే వెల్లడించారు. ఈ యాప్‌ ద్వారా 'వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌' కార్డు కింద రేషన్‌ కార్డు పోర్టబులిటీని కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పాండే తెలిపారు. ప్రస్తుతం 32 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విధానం అమల్లో ఉందన్నారు.

ఈ యాప్‌ను నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) రూపొందించింది. ప్రస్తుతం ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా.. త్వరలో 14 భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు పాండే. వలసదారులు తమ వివరాలను పొందు పర్చడం సహా ఆధార్‌ సీడింగ్‌ వివరాలనూ తెలుసుకోవచ్చన్నారు. ఆధార్‌ లేదా రేషన్‌ కార్డు నంబర్‌ ద్వారా యాప్‌లో లాగిన్‌ అవ్వొచ్చు.

ఇదీ చదవండి : 'బలగాల ఉపసంహరణతో సత్ఫలితాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.