ETV Bharat / bharat

11 ఏళ్ల బాలికపై ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు అత్యాచారం - రేప్

ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తల్లికి తోడుగా ఉన్న 11ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అక్కడి సెక్యూరిటీ గార్డు. ఈ సంఘటన దాద్రానగర్​ హవేలీ​లో జరిగింది. మరో ఘటనలో మూడేళ్ల చిన్నారిని ఇంట్లో నుంచి అపహరించి అత్యాచారయత్నం చేశాడు ఓ దుండగుడు.

minor girl rape
అత్యాచారం
author img

By

Published : Jan 16, 2022, 6:34 AM IST

కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్​ హవేలీలో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తల్లి వెంట ఉన్న 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అక్కడి సెక్యూరిటీ గార్డు.

దమణ్ జిల్లాలోని మార్వాడ్​ ప్రభుత్వ ఆసుపత్రిలో జనవరి 11న ఈ అమానుష ఘటన జరిగింది. అక్కడ చికిత్స పొందుతోన్న తన తల్లితో కలిసి బాలిక ఉందని అధికారులు చెప్పారు. చిన్నారికి తాగునీరు ఇచ్చే నెపంతో ఆసుపత్రిలోని ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.

ఈ ఘటన బయటపడిన అనంతరం ఆసుపత్రి నుంచి సెక్యూరిటీ గార్డ్​ పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం విస్తృతంగా గాలించారు. శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు.

మూడేళ్ల చిన్నారిని అపహరించి.. ఆపై

రాజస్థాన్​లోని బూందీ జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఆడుకుంటోన్న మూడేళ్ల చిన్నారిని అపహరించి, అత్యాచారానికి యత్నించబోయాడు హన్స్​రాజ్ అనే వ్యక్తి. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. చిన్నారి కనిపించకపోవడం వల్ల ఇంటి సమీపంతో పాటు చుట్టుపక్కల వెతికారు కుటుంబ సభ్యులు. చివరకు గ్రామంలోని ఓ గుడిలో పాపతో ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు.

అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: సినిమా ఛాన్స్ పేరుతో బాలికపై ఫిల్మ్​ మేకర్ లైంగిక దాడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.