ETV Bharat / bharat

'జులైలోనే పార్లమెంటు​ సమావేశాలు!'

పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు జులై నెలలో ప్రారంభమవుతాయని కేంద్రం తెలిపింది. సాధారణ షెడ్యూల్​ ప్రకారం సమావేశాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి.

Parliament Monsoon Session
పార్లమెంటు​ వర్షకాలపు సమావేశాలు
author img

By

Published : Jun 8, 2021, 5:20 PM IST

కరోనా రెండోదశ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంటు​ వర్షాకాలం సమావేశాలు సాధారణ షెడ్యూల్​ ప్రకారం జులైలో ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్​ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటు సెషన్స్​ కుదించినట్లు పేర్కొన్న కేంద్ర మంత్రి.. గతేడాది పార్లమెంటు శీతాకాలపు సమావేశాలు రద్దు చేసినట్లు గుర్తు చేశారు.

గతేడాది సాధారణంగా జులైలో ప్రారంభం కావాల్సిన వర్షాకాలం సమావేశాలు సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి యథావిధిగా జరుగుతాయన జోషి పేర్కొన్నారు. మరోవైపు ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఎంపీలకు స్పీకర్ లేఖ

కరోనా కాలంలో తమ నియోజకవర్గాల్లో చేపట్టిన సహాయక చర్యల వివరాలు తెలియచేయాలని ఎంపీలను కోరారు లోక్‌సభ స్పీకరు ఓం బిర్లా. ఈ మేరకు వారందరికీ లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేయడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఐదో తరగతి విద్యార్థి లేఖకు సీజేఐ ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.