ETV Bharat / bharat

కొవిడ్​ టీకా ధరలు తగ్గించండి: కేంద్రం - దేశంలో కొవిషీల్డ్​ టీకా ధర

దేశంలో వ్యాక్సిన్​ ధరలపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నందున.. వీటిపై కేంద్రం స్పందించింది. ఈ మేరకు కేబినెట్​ కార్యదర్శి రాజీవ్​ గౌబా అధ్యక్షతన టీకా రేట్లపై సంబంధిత కంపెనీలతో చర్చించింది కేంద్రం.

Bharat Biotech, Serum Institute of India
భారత్​ బయోటెక్​, సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా
author img

By

Published : Apr 26, 2021, 9:16 PM IST

కరోనా వ్యాక్సిన్ల ధరలను తగ్గించాలని సంబంధిత టీకా ఉత్పత్తి కేంద్రాలను కోరింది కేంద్రం. దేశవ్యాప్తంగా సంక్షోభం నెలకొన్న సమయంలో.. ఒకే వ్యాక్సిన్​కు రకరకాల ధరలు నిర్ణయించడంపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న వేళ.. ఈ మేరకు భారత్​ బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్​లను అభ్యర్థించింది. కేబినెట్​ కార్యదర్శి రాజీవ్​ గౌబా అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీకా ధరల అంశంపై చర్చించారు.

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్.. తాము ఉత్పత్తి చేసిన 'కొవాగ్జిన్​' ధరను ఒక్క డోసుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.600; ప్రైవేట్​ ఆస్పత్రులకు రూ.1,200లుగా నిర్ణయించింది.

ఇదీ చదవండి: 'మే 14-18 తేదీల్లో కరోనా ఉగ్రరూపం.. ఆ తర్వాత..'

పుణెకు చెందిన సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(ఎస్​ఐఐ).. దేశంలో తయారు చేస్తున్న 'కొవిషీల్డ్'​ వ్యాక్సిన్​ ఒక్క మోతాదుకు రాష్ట్రాలకు రూ.400 గానూ; ప్రైవేట్​ ఆస్పత్రులకు రూ.600గానూ విక్రయిస్తున్నట్టు ప్రకటించింది.

ఈ రెండు టీకాలు.. కేంద్ర ప్రభుత్వానికి ఒక్క డోసును రూ.150 చొప్పున ఇస్తున్నాయి.

ఇలా.. ఒక్క వ్యాక్సిన్​కు రకరకాల ధరలు ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని ప్రశ్నించాయి. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ కూడా ఇటీవల ఈ అంశంపై స్పందించారు. వ్యాక్సిన్​లపై లాభాలను ఆర్జించేందుకు ఇది సరైన సమయం కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: చిన్నారుల సరికొత్త నేస్తం 'ఈటీవీ బాలభారత్'​- రేపే ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.