ETV Bharat / bharat

టాయిలెట్ గోడ కూలి బాలుడి మృతి.. రైలులో ఘర్షణకు ఒకరు బలి

author img

By

Published : Mar 13, 2023, 12:21 PM IST

Updated : Mar 13, 2023, 3:54 PM IST

టాయిలెట్ గోడ కూలి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నాసిరకంగా టాయిలెట్ నిర్మించడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, రైలులో తలెత్తిన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది.

Government Toilet Collapses Child Dies Buried Under Debris in uttar pradesh
శిథిలా వస్థలో ప్రభుత్వ టాయిలెట్లు..5ఏళ్ల బాలుడి మృతి

ఉత్తర్​ప్రదేశ్​లోని లఖీంపుర్​ ఖేరి జిల్లాలో విషాద సంఘటన జరిగింది. టాయిలెట్ గోడలు, సీలింగ్ కూలడం వల్ల ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నాసిరకంగా టాయిలెట్ నిర్మాణం చేపట్టడం వల్లే ఈ విషాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినప్పటికీ అధికారులు ఎవరూ స్పందించకపోవడం విచారకరమని అంటున్నారు.

మగల్‌గంజ్ ప్రాంతంలోని చపర్తల గ్రామానికి చెందిన లల్తా ఇంటి బయట ప్రభుత్వ నిధులతో కట్టిన మరుగుదొడ్డి ఉంది. ఈ మరుగుదొడ్డిని 2016లో నిర్మించారు. దానిని నాసిరకపు ఇటుకలతో నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. అందువల్ల ఆ టాయిలెట్​ను ఎవరూ వినియోగించడం లేదు. శనివారం లల్తా ఐదేళ్ల కుమారుడు పంకజ్ తన స్నేహితులతో కలిసి టాయిలెట్ దగ్గర ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా మరుగుదొడ్డి సీలింగ్, గోడలు పేకమేడలా కూలి పడిపోయాయి. పక్కనే ఉన్న చిన్నారి.. ఆ శిథిలాల కింద పడి మృతి చెందాడు. మరుగుదొడ్డి నిర్మాణానికి నాసిరకం వస్తువులు వాడారని చిన్నారి బంధువులు ఆరోపిస్తున్నారు.

మరుగుదొడ్ల నిర్మాణంపై విమర్శలు
ప్రభుత్వ నిధులతో నిర్మించిన మరుగుదొడ్లు కూలిపోవడం విమర్శలకు దారి తీస్తోంది. 'ఏడేళ్ల క్రితమే మరుగుదొడ్డిని నిర్మించారు. కానీ, పెద్దగా దానిని ఉపయోగించలేదు. మరుగుదొడ్డిలోకి వెళ్లాలంటేనే భయపడే విధంగా దాని నిర్మాణం జరిగింది. సర్పంచ్, గ్రామ సెక్రటరీ టాయిలెట్‌ను కాంట్రాక్ట్‌పై నిర్మించారు. మొదటి నుంచి మరుగుదొడ్డి పరిస్థితి బాలేదు. దానిని ఉపయోగించడమే మానేశాము. చాలా ఏళ్లుగా మరుగుదొడ్డిని ఎవరూ ఉపయోగించకుండా అలా నిలిచిపోయింది' అని చిన్నారి తల్లి లల్తా తెలిపింది. ఈ ప్రమాదం శనివారం జరిగింది. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం పంపినట్లు ఇన్‌స్పెక్టర్, ఇన్‌ఛార్జ్ దీపక్ రాయ్ తెలిపారు.

రైలులో ఘర్షణ
ఝార్ఖండ్​లో ఆదివారం మధ్యాహ్నం రైలులో ప్రయాణికుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించగా.. ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. కొంత మంది ప్రయాణికులు కదులుతున్న రైలు నుంచి ఇద్దరు వ్యక్తులను తోసేశారు. చక్రధర్‌పుర్, లోటా పహార్ రైల్వే స్టేషన్‌ల మధ్య ముర్హతు గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం
టిట్లాగఢ్ హౌరా ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ రైలు కంపార్ట్‌మెంట్‌లో కొంత మంది ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. కొద్దిసేపటికే ఆ గొడవ తీవ్రమైంది. కొంతమంది ప్రయాణికులు ఒక వ్యక్తిని దారుణంగా కొట్టడం ప్రారంభించారు. దానిని చూసి, చక్రధర్‌పూర్ నుంచి జార్సుగూడకు వెళ్తున్న భర్నియా గ్రామానికి చెందిన దులు సర్దార్‌ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో కోపోద్రిక్తులైన ప్రయాణికులు దులుపై కూడా దాడి చేశారు. వారిద్దరినీ కొట్టి కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేశారు.

అందులో ఓ వ్యక్తి ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలుకు ఢీకొట్టుకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దులును బయటకు తోసినప్పుడు రైలు నెమ్మదిగా వెళ్తోంది. అందుకే అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రైల్వే ట్రాక్​లోని రాళ్లమీద పడటం వల్ల తలకు గాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దులును చక్రధర్​పుర్ ఆస్పత్రిలో చేర్పించామని పోలీసులు తెలిపారు. దులు నుంచి కంప్లయింట్ తీసుకున్న పోలీసులు.. ఎవరు దాడి చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 13, 2023, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.