ETV Bharat / bharat

దివ్యాంగులకు కేంద్రం షాక్- ఉద్యోగ కోటాకు గండి! - దివ్యాంగుల హక్కుల చట్టం

దివ్యాంగులకు ఉద్యోగ కోటా నుంచి పలు పోలీసు సర్వీసులు, సాయుధ విభాగాల్లోని కొన్ని పోస్టులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కాగా, ఈ నిర్ణయంపై పలు హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి.

job quota to disabled
ఉద్యోగ కోటా
author img

By

Published : Aug 19, 2021, 7:45 PM IST

Updated : Aug 19, 2021, 7:58 PM IST

దివ్యాంగులకు ఉద్యోగ కోటా నుంచి.. పలు పోలీసు సర్వీసులు, సాయుధ విభాగాల్లో కొన్ని పోస్టులను, దేశంలోని పలు ప్రాంతాలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రెండు గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేసింది. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 నుంచి వీటిని మినహాయిస్తున్నట్లు అందులో పేర్కొంది.

ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌, భారత రైల్వే భద్రతా దళం కేటగిరీ కిందకు వచ్చే అన్ని పోస్టులు.. సీఆర్​పీఎఫ్​,బీఎస్​ఎఫ్​ వంటి సాయుధ విభాగాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దిల్లీ సహా అయిదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అన్ని కేటగిరిల్లోని పోస్టులను కూడా దివ్యాంగుల ఉద్యోగ కోటాను మినహాయించింది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దివ్యాంగుల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నిర్ణయం దివ్యాంగులకు తీవ్ర అన్యాయం చేస్తుందని దివ్యాంగుల ఉద్యోగ ప్రోత్సాహ జాతీయ సంస్ధ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసు విభాగంలో క్షేత్ర స్ధాయి విధులే కాకుండా ఐటీ, సైబర్‌, ఫోరెన్సిక్‌ విభాగాల్లో కూడా విధులు నిర్వహించవచ్చని గుర్తు చేసింది.

ఇదీ చూడండి: 'రిజర్వేషన్​లలో 50శాతం పరిమితిని ఎత్తేయండి'

Last Updated : Aug 19, 2021, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.