Govardhan Puja 2023 Wishes and Quotes in Telugu: శ్రీ కృష్ణుడు గోవర్ధన గిరిని పైకెత్తి బృందావన వాసులను రక్షించే లీలను కొనియాడుతూ చేసుకునేది గోవర్ధన మహోత్సవం లేదా గోవర్ధన పూజ. ప్రతి సంవత్సరం దీపావళి మరునాడు గోవర్ధన్ పూజను జరుపుకుంటారు. దీనిని అనేక ప్రాంతాల్లో అన్న కూట్ అని కూడా పిలుస్తారు. ఈ పండగ ప్రకృతికి, మానవులకు మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక.
సనాతన ధర్మంలో గోవర్ధన పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు గోమాతను, గోవర్ధన పర్వతాలతో పాటుగా శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజు శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల జీవితంలోని దుఃఖాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఈ సారి గోవర్ధన పూజ తిథి.. నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 2:56 గంటలకు ప్రారంభమయ్యి.. నవంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 2:36 గంటల వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ తిథి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం గోవర్ధన పూజను నవంబర్ 14వ తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మరి ఈ పండగ వేళ.. మీ ప్రియమైన వారికి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలపండి. ఇందుకోసమే "ఈటీవీ భారత్" విషెస్, స్పెషల్ కోట్స్ అందిస్తోంది.
గోవర్ధన పూజ ఎప్పుడు- 13నా? 14వ తేదీనా? శుభ ముహూర్తం, పూజా విధానం!
Govardhan Puja 2023 Wishes in Telugu:
- కృష్ణ భగవానుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ.. అందరికీ గోవర్ధన పూజ శుభాకాంక్షలు
- మీరు జీవితంలో అన్ని సంతోషాలను పొందాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ.. గోవర్ధన పూజ శుభాకాంక్షలు
- ఈ పండగ మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యాలని కోరుకుంటూ.. మీకు గోవర్ధన పూజ శుభాకాంక్షలు
- ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు తేవాలని, ఆ కన్నయ్య ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ.. గోవర్ధన పూజ శుభాకాంక్షలు
- ఆ కృష్ణ భగవానుడి కృపాకటాక్షాలు మీ ఇంటిపై కురిసి, మీ జీవితంలో ఎప్పుడూ సుఖశాంతులు నిండాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు గోవర్ధన పూజ శుభాకాంక్షలు
- శ్రీ కృష్ణుడి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ.. గోవర్ధన పూజ శుభాకాంక్షలు
Govardhan Puja 2023 Quotes in Telugu :
- "అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరా"- గోవర్ధన పూజ శుభాకాంక్షలు
- "ప్రారంభం ఎక్కడో తెలియదు.. ముగింపు ఎప్పుడో తెలియదు.. మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. అందుకోసం చింతించాల్సిన అవసరం లేదు"- గోవర్ధన పూజ శుభాకాంక్షలు
- "శ్రద్ధగా పని చేయకుండా.. ఎవరూ మంచి ఫలితాన్ని పొందలేరు"- గోవర్ధన పూజ శుభాకాంక్షలు
- "చేసే పని ఏదైనా కష్టపడితేనే అది పూర్తవుతుంది. దాని కోసం కలలు కంటూ ఉంటే అణువంతైనా ముందుకు కదలదు. ఇష్టం ఉన్నప్పుడు కష్టమైనా అది శ్రమనిపించదు. అందుకే చేసే పనిని ప్రేమించాలి"- గోవర్ధన పూజ శుభాకాంక్షలు
- "ప్రయత్నం ఎప్పటికీ వృథా కాదు.. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది"- గోవర్ధన పూజ శుభాకాంక్షలు
- "మనసును స్వాధీన పరచుకున్నవాడికి తన మనసే బంధువు.. మనసును జయించలేని వాడికి అదే శత్రువుగా ప్రవర్తిస్తుంది"- గోవర్ధన పూజ శుభాకాంక్షలు
- "నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏదీ రాదు.. నీకు రావాలి అని రాసిపెట్టింది ఏదీ ఆగదు"-గోవర్ధన పూజ శుభాకాంక్షలు