ETV Bharat / bharat

బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదలపై వివాదం, విపక్షాలు ఫైర్

గోద్రా అల్లర్ల సమయంలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో దోషులను క్షమాభిక్ష కింద విడుదల చేయడం వివాదాస్పదమైంది. అత్యాచార కేసులో దోషులను ఈ విధానం కింద విడుదల చేయరాదని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ, సుప్రీంకోర్టు సూచన మేరకు గుజరాత్‌ సర్కారు క్షమాభిక్ష పెట్టింది. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

bilkis bano godhra
బిల్కిస్‌ బానో
author img

By

Published : Aug 16, 2022, 4:55 PM IST

Updated : Aug 16, 2022, 6:10 PM IST

Bilkis Bano News: 2002నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో గర్భిణీపై సామూహిక అత్యాచారం సహా బాధితురాలు బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హత్య చేసిన ఘటనలో దోషులు.. జైలు నుంచి విడుదల కావడంపై దుమారం రేగుతోంది. ఈ కేసులో 11 మందికి సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించగా.. దాదాపు 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుజరాత్‌ ప్రభుత్వం 11 మందికి క్షమాభిక్ష ప్రసాదించగా.. వారు సోమవారం గోద్రా సబ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో 2008 జనవరి 21న నిందితులకు జీవిత ఖైదు పడగా.. దాదాపు 15 ఏళ్లు జైలులో ఉన్నారు. తమను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడి అభ్యర్థనను పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం గుజరాత్‌ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటుచేయగా 11మందికి క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా సోమవారం ఖైదీల విడుదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. జైలు నుంచి విడుదలైన వారికి.. బంధువులు పూలదండలు వేసి, మిఠాయిలు తినిపించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఖైదీల విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జూన్‌ నెలలో మార్గదర్శకాలు విడుదల చేసింది. అత్యాచార కేసుల్లో దోషులను మాత్రం విడుదల చేయరాదని స్పష్టం చేసింది. కానీ సుప్రీంకోర్టు దిశానిర్దేశం మేరకు గుజరాత్‌ ప్రభుత్వం సొంత మార్గదర్శకాలను అనుసరించి.. 11 మందిని విడుదల చేసింది.

గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. క్షమాభిక్ష ద్వారా రేపిస్టులను విడుదల చేసిన ప్రధాని మోదీ మాతృ రాష్ట్రం గుజరాత్‌ మిగతావారికి ఆదర్శంగా నిలుస్తోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాయి. మరోవైపు ఈ కేసులో దోషులు.. తాము జైలు నుంచి విడుదల కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల జీవిత ఖైదును పూర్తిచేసుకున్నప్పటికీ తమను విడుదల చేయలేదని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్దేశం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల బయటకొచ్చామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: నదిలో పడ్డ జవాన్ల వాహనం, ఎనిమిది మంది మృతి

గర్భిణీని మోస్తూ అడవిలో 3కిమీ నడక, అయినా దక్కని కవలల ప్రాణాలు

Last Updated : Aug 16, 2022, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.