కరోనా ఉద్ధృతి వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో శానిటైజేషన్ పనుల్లో స్వయంగా పాల్గొన్నారు నటుడు, ఎంపీ రవికిషన్. గోరఖ్‌పుర్‌లోని రజహీలో మంగళవారం పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తన స్వహస్తాలతో క్రిమి సంహారక రసాయనాన్ని పిచికారీ చేశారు.
పరిశుభ్రత పాటించాలి..
వైరస్ కేసులు పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని రవికిషన్ చెప్పారు. భద్రత, పరిశుభ్రత అన్నింటికన్నా ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మాస్కులు పంపిణీ చేశారు.
ఉచిత రేషన్..
అనంతరం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు రవికిషన్. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, ఆనందమే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యం అని చెప్పారు. రేషన్ కార్డులు లేని వారికి వెంటనే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: మండలి ఏర్పాటుపై దీదీ కల ఇప్పట్లో నెరవేరేనా?