uttar pradesh dalit atrocity: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహోబా జిల్లాలో ఓ దళితుడితో కర్కశంగా ప్రవర్తించారు స్థానికులు. మలవిసర్జనకు వెళ్లిన యువకుడి శరీరభాగాల్లోకి మద్యం బాటిల్‌ను చొప్పించారు. అంజర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గ్రామం శివారులో కొందరు వ్యక్తులు మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్లాడు బాధితుడు. మద్యం తాగుతున్న వ్యక్తులు అతడిని పిలిచి.. అనుచితంగా ప్రవర్తించారు. అదే సమయంలో మద్యం బాటిల్‌ను అతని శరీరంలోకి చొప్పించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన యువకుడు.. దీని గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే, నొప్పి తీవ్రం కావడం వల్ల.. ఇంట్లో వాళ్లకు జరిగిన విషయం చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. జైత్పుర్లోని స్థానిక హెల్త్ సెంటర్లో పరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: