ETV Bharat / bharat

ఈసీకి టీఎంసీ, భాజపా పోటాపోటీ ఫిర్యాదులు

బంగాల్​ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్క రోజు ముందు సీఎం మమతా బెనర్జీ, భాజపా నేతలు.. ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు. నందిగ్రామ్​లోకి ఇతర రాష్ట్రాలకు చెందిన గూండాలు వచ్చి ఓటర్లను భయపెడుతున్నారని మమత ఆరోపించారు. భాజపా మద్దతుదారులను బంగాల్ సీఎం బెదిరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఈసీని ఆశ్రయించారు.

Mamata, bengal cm
మమత బెనర్జీ, బంగాల్ సీఎం
author img

By

Published : Mar 31, 2021, 5:47 PM IST

నందిగ్రామ్​లోకి ఇతర రాష్టాలకు చెందిన గూండాలు వచ్చి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్వ మిడ్నాపుర్​ జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలను కొందరు బయటి వ్యక్తులు భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

ఈ ఆరోపణలను భాజపా తోసిపుచ్చింది. ఓటమి భయంతోనే మమత ఇలా చేస్తున్నారని విమర్శించింది.

భాజపా ఫిర్యాదు..

భాజపా మద్దతుదారులను మమతా బెనర్జీ బెదిరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఆమె చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే పలు చోట్ల హింస చెలరేగిందని ఆరోపించారు. మార్చి 29న నందిగ్రామ్​ ర్యాలీలో మమత ప్రసంగాన్ని ఆధారంగా చూపారు. " బంగాల్​లో ప్రస్తుతం ఉన్న కేంద్ర పారామిలటరీ బలగాలు కొద్ది రోజుల తర్వాత వెళ్లిపోతాయి. నేను మాత్రం ఈ రాష్ట్రంలోనే ఉంటా. నా ప్రత్యర్థులను ఎవరు కాపాడుతారు?" అని ఓ సమావేశంలో మమత అన్నారు.

ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమే కాక, ఓటర్లను ప్రభావితం చేసేలా మమత మాట్లాడారని ఆరోపించింది.

రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బంగాల్​లో 30 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. సీఎం మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి బరిలో ఉన్న నందిగ్రామ్ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.

నందిగ్రామ్​లో 144 సెక్షన్​..

నందిగ్రామ్​ వంటి సమస్యాత్మక ప్రాంతంలో అల్లర్లు చెలరేగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ అక్కడ నిషేధాజ్ఞలు జారీ చేసింది. నందిగ్రామ్‌ వ్యాప్తంగా నేటి నుంచి 144 సెక్షన్‌ విధించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

''మమతా బెనర్జీ, సువేందు అధికారి వంటి అత్యంత ప్రముఖ నేతలు పోటీలో ఉన్నందున ఈ నియోజకవర్గాన్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించాం. అందుకే శాంతిభద్రతల విషయంలో రాజీపడట్లేదు. ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేందుకు రావాలి. అందుకే ఇక్కడ నిషేదాజ్ఞలు విధించాం. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. పోలింగ్‌ పూర్తయ్యే వరకు నందిగ్రామ్‌ ఓటరు కాని ఏ వ్యక్తినీ నియోజకవర్గంలోకి అనుమతించేది లేదు.'' అని అధికారులు స్పష్టం చేశారు.

ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడరాదని ఈసీ ఆదేశించింది. మరోవైపు హెలికాప్టర్లతో నిఘా పెంచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ దృష్ట్యా ఈ ప్రాంతంలో 22 కంపెనీల కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. రాష్ట్ర పోలీసులు కూడా భారీగా మోహరించారు. నియోజకవర్గానికి వచ్చే అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బయటి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. అల్లర్లకు పాల్పడాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: భాజపాయేతర పార్టీలకు మమత లేఖ

'ఓటింగ్​ శాతం పెరగడం మార్పునకు సంకేతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.