కేరళ కొచ్చి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవిలాంటి నిర్మాణం కనిపించడం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. గూగుల్ మ్యాప్స్ బయటపెట్టిన ఈ రహస్య ఐలాండ్‌పై ప్రస్తుతం పరిశోధకులు దృష్టి సారించారు. సముద్ర గర్భంలో కనిపిస్తున్న ఈ నిర్మాణం ఏంటి? ఎలా ఏర్పడిందన్న కోణంలో పరిశోధనలు చేయడానికి కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ పరిశోధకులు సిద్ధమయ్యారు.
ఈ దీవిలాంటి నిర్మాణాన్ని తొలిసారి చెల్లనమ్ కర్షిక టూరిజం డెవలప్‌మెంట్ సొసైటీ గుర్తించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆ సంస్థ ఫేస్‌బుక్‌లో పంచుకోవడం వల్ల రహస్య దీవి విషయం వెలుగులోకి వచ్చింది. అరేబియా సముద్రంలో ఓ దీవిలాంటి నిర్మాణం ఉన్నట్టు గూగుల్ మ్యాప్స్ చూపిస్తోందని ఈ సంస్థ అధ్యక్షుడు జేవీఆర్ జుల్లప్పన్ చెప్పారు. కొచ్చి తీరానికి 7 కి.మీ దూరంలో ఇది ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నీటి అడుగున ప్రవాహం కారణంగా దీవి లాంటి నిర్మాణం ఏర్పడి ఉండవచ్చని జుల్లప్పన్ అభిప్రాయపడ్డారు. తీర అవక్షేపం, తీరం కోతకు గురికావడం వంటి కారణాల వల్ల కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. దీనిపై మరింత అధ్యయనం అవసరమని జేవీఆర్ జుల్లప్పన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గూగుల్‌నే మోసం చేసిన ఘనుడు.. ఎలాగో చూడండి!
ఇదీ చదవండి: గూగుల్‌ను నమ్ముకుంటే.. వధువే మారిపోయింది
8 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణం ఏర్పడినట్లు చెల్లనమ్ కర్షిక టూరిజం డెవలప్‌మెంట్ సొసైటీ తెలిపింది. ఇదేంటో గుర్తించాలని కేరళ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్‌కు చెల్లనమ్ సంస్థ లేఖ రాసింది. గత నాలుగేళ్లుగా ఆ ప్రాంతంలో దీవిలాంటి నిర్మాణాన్ని గమనిస్తున్నామని, అయితే దాని పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదని ఆ సంస్థ తెలిపింది. దీంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం దీనిపై పరిశోధన చేయాల్సిందిగా కేరళ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ అధికారులను ఆదేశించింది.
ఇవీ చదవండి: