Derailed goods trains cancel: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తాడి-అనకాపల్లి మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్.. తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించడంతో విశాఖ-విజయవాడ ప్రధాన మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని ఆలస్యంగా ప్రయాణిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. జన్మభూమి, సింహాద్రి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కాగా, విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడవనుంది. ఉదయం 5.45 గంటలకు బదులుగా దాదాపు మూడు గంటలు ఆలస్యంగా... 8.45 గంటలకు బయల్దేరనుందని రైల్వే తెలిపింది. ఇక.. ఒడిశా బహానగ బజార్ స్టేషన్‌లో ట్రాక్ నిర్వహణ పనుల వల్ల 15 రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
విజయవాడ డివిజన్‌లో రైల్వే మౌలిక సదుపాయాల పనులతో పలు రైళ్లు రద్దు, మళ్లింపు
- ఈ నెల 18 వరకు విశాఖ - రాజమహేంద్రవరం ప్యాసింజర్ ప్రత్యేక రైలు(07467) రద్దు
- ఈ నెల 18 వరకు రాజమహేంద్రవరం - విశాఖ ప్యాసింజర్ ప్రత్యేక రైలు(07466) రద్దు
- ఈ నెల 18 వరకు కాకినాడ - విశాఖ ఎక్స్‌ప్రెస్ (17267) రద్దు
- ఈ నెల 18 వరకు విశాఖ - కాకినాడ ఎక్స్‌ప్రెస్ (17268) రద్దు
ఒడిశా బహానగ బజార్ స్టేషన్‌లో ట్రాక్ నిర్వహణ పనుల వల్ల 15 రైళ్లు రద్దు..
- బుధవారం విశాఖ - షాలిమార్ (22854) ఎక్స్‌ప్రెస్ రద్దు
- గురువారం షాలిమార్ - హైదరాబాద్ ఈస్ట్‌కోస్టు (18045) ఎక్స్‌ప్రెస్ రద్దు
- బుధవారం షాలిమార్ - సికింద్రాబాద్ (12773) ఎక్స్‌ప్రెస్ రద్దు
- బుధవారం షాలిమార్ - సికింద్రాబాద్ (22849) ఎక్స్‌ప్రెస్ రద్దు
- శుక్రవారం సికింద్రాబాద్ - షాలిమార్ (22850) ఎక్స్‌ప్రెస్ రద్దు
- బుధవారం హావ్‌డా - ప్రశాంతి నిలయం (22831) ఎక్స్‌ప్రెస్ రద్దు
- శుక్రవారం ప్రశాంతి నిలయం - హావ్‌డా (22832) ఎక్స్‌ప్రెస్ రద్దు
- గురువారం విశాఖ నుంచి బయల్దేరే దిఘా (22874) ఎక్స్‌ప్రెస్ రద్దు
తాడి-అనకాపల్లి మధ్య పూర్తయిన ట్రాక్ మరమ్మతులు పూర్తయ్యాయి. తెల్లవారుజామున 3.35 గంటలకు బొగ్గు లోడ్ గూడ్స్ రైలు ఒక బోగీ పట్టాలు తప్పి నిలిచిపోగా మరమ్మతులు పూర్తి చేసిన అనంతరం గూడ్స్ రైలు బయల్దేరింది. ఈ కారణంగా విశాఖ-విజయవాడ ప్రధాన మార్గంలో పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. జన్మభూమి, సింహాద్రి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడవడంతో పాటు.. మరికొన్ని రదుద కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈటీవల వందభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యంగా నడవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.