ETV Bharat / bharat

'భారత చిత్ర పరిశ్రమ ఓ గొప్ప నటుడ్ని కోల్పోయింది' - Puneeth rajkumar death

కన్నడ కంఠీరవ రాజ్​కుమార్​ తనయుడు పునీత్​ రాజ్​కుమార్ (Puneeth rajkumar news)​ మరణంతో.. భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన అకాల మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ (Modi puneeth rajkumar) సహా పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత చిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడ్ని కోల్పోయిందని అన్నారు.

PM Modi & Vice president, Rahul Gandhi's condolence messages over the death of Puneeth Rajkumar
'భారత చిత్ర పరిశ్రమ ఓ గొప్ప నటుడ్ని కోల్పోయింది'
author img

By

Published : Oct 29, 2021, 7:31 PM IST

శాండల్​వుడ్​ సూపర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్ (Puneeth rajkumar news)​ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఓ గొప్ప నటుడ్ని విధి మన నుంచి దూరం చేసిందని అన్నారు. ఆయన పనిని, గొప్ప వ్యక్తిత్వాన్ని భవిష్యత్​ తరాలు గుర్తుంచుకుంటాయని మోదీ (Modi puneeth rajkumar) ట్వీట్​ చేశారు. పునీత్​ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గతంలో పునీత్​తో దిగిన ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేశారు మోదీ.

PUNEETH RAJKUAMR
మోదీ ట్వీట్​

పునీత్​ మరణం (Puneeth rajkumar death).. కన్నడ చిత్రసీమకు తీరని లోటు అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బాలనటుడిగా కెరీర్​ ప్రారంభించి.. గొప్ప నటుడు, ప్లేబ్యాక్​ సింగర్​, టీవీ వ్యాఖ్యాత, నిర్మాతగా పునీత్​ ఎదిగారని గుర్తుచేసుకున్నారు. ​

చిన్న వయసులో పునీత్ ​(Puneeth rajkumar age) మరణించడం బాధాకరం అన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.

పునీత్‌ ఆకస్మిక మరణం తనను వ్యక్తిగతంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై అన్నారు. కన్నడిగుల అభిమాన హీరో అప్పూ మరణం కన్నడ చిత్రసీమకు, కర్ణాటకకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, పునీత్‌ ఇకలేరన్న బాధను తట్టుకొనే శక్తిని అభిమానులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు ట్విట్టర్‌లో తెలిపారు. అంతకుముందు పునీత్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి.. నేరుగా ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

PUNEETH RAJKUAMR
ట్వీట్​ చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి

పునీత్​ మరణం(Puneeth rajkumar news) వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​. రాజ్​కుమార్​ కుటుంబంతో దశాబ్దాలుగా ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.

PUNEETH RAJKUAMR STALIN
స్టాలిన్​ ట్వీట్​

పాపులర్‌ హీరో పునీత్​ ఆకస్మిక మరణం(Puneeth rajkumar death) తనను షాక్‌కు గురిచేసిందని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప అన్నారు. చిన్న వయస్సులోనే ​(Puneeth rajkumar age) మనందరినీ వదిలి వెళ్లిపోవడం కలిచివేస్తోందన్నారు.

అందరి హృదయాల్లో చిరస్థాయిగా..

పునీత్‌ మరణించారన్న విషయాన్ని అంగీకరించలేకపోతున్నట్టు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ''రాజ్‌కుమార్‌ మంచి గాయకుడు కూడా. బాలనటుడిగా తెరంగేట్రం చేసి గొప్ప హీరోగా ఎదిగారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. పవర్‌స్టార్‌ సినీ ప్రేమికులందరి హృదయాల్లో ఉంటారు'' అని పేర్కొన్నారు. పునీత్‌తో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు.

శుక్రవారం ఉదయం జిమ్​లో (Rajkumar death reason) కసరత్తులు చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన పునీత్ (Puneeth rajkumar news)​.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంతో.. కన్నడ సహా దేశ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇవీ చూడండి: నేత్రదానం చేసిన పునీత్​.. తండ్రి అడుగుజాడల్లోనే​...

Puneeth Rajkumar News: ఆరు నెలల వయసులోనే సినీ అరంగేట్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.