Gold Smuggling: ఒడిశా భువనేశ్వర్‌లో అక్రమంగా తరలిస్తున్న 32కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బంగారం విలువ రూ.12 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు.
![Gold Smuggling](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-bbs-02-gold-seized-avo-7203832_02032022110729_0203f_1646199449_507_0203newsroom_1646200721_186.jpg)
ముంబయి నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో భువనేశ్వర్‌కు బంగారాన్ని తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు బ్యాగుల్లో తరలిస్తున్న 32 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. ప్రతీ బ్యాగ్‌లో 8కేజీల చొప్పున బంగారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ముంబయికి చెందినవారుగా గుర్తించారు. ముంబయికి చెందిన బంగారం వ్యాపారుల ఆదేశాల మేరకు నిందితులు పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
![Gold Smuggling](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-bbs-02-gold-seized-avo-7203832_02032022110729_0203f_1646199449_133_0203newsroom_1646200721_600.jpg)
ఇదీ చదవండి: 200 మంది మహిళలు.. 4000 నగ్నఫొటోలు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ గలీజ్ దందా!