గోవా పర్యటక శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. బీచ్‌ల్లో మద్యం తాగితే రూ.10వేలు చొప్పున జరిమానా విధించనున్నట్టు ప్రకటించింది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో గోవాలోని పలు తీర ప్రాంతాలు మద్యం సీసాలతో నిండిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.
బీచ్‌ల్లో మద్యం తాగొద్దని సూచిస్తూ హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసినట్టు పర్యటక శాఖ డైరెక్టర్ మెనినో డిసౌజా తెలిపారు. బీచ్‌లలో మద్యం తాగితే వ్యక్తులపై రూ.2వేలు, సమూహాలపై రూ.10వేలు చొప్పున జరిమానా విధించేలా 2019 జనవరిలోనే పర్యటక వాణిజ్య చట్టానికి సవరణలు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సవరించిన చట్టాన్ని పర్యటక శాఖ పోలీసుల ద్వారా అమలుచేయనున్నట్టు తెలిపారు. తమ శాఖకు సిబ్బంది తగినంతగా ఉంటే వారితోనే సొంతంగా దీన్ని అమలు చేయగలుగుతామని మెనినో డిసౌజా అన్నారు.
ఇదీ చూడండి: ఆరుగురు పాక్ చొరబాటుదారుల అరెస్ట్