Goa assembly polls: గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అమిత్ పాలేకర్ తమ పార్టీ సీఎం అభ్యర్థిగా దిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గోవాలో ఉన్న 40 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీలో ఉంటుందని వెల్లడించారు. బండారీ సామాజిక వర్గానికి చెందిన అమిత్ పాలేకర్.. ఒక న్యాయవాది అని కేజ్రీవాల్ తెలిపారు.
పాత గోవా వారసత్వ ప్రాంతాన్ని కాపాడాలని కోరుతూ ఇటీవల నిరాహార దీక్ష చేపట్టిన పాలేకర్.. ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి పాలేకర్కు లభించిన మద్దతుతో ప్రభుత్వం దిగివచ్చిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను మంగళవారం ప్రకటించారు.
ఇదీ చూడండి: పంజాబ్ ఆప్ 'సీఎం' అభ్యర్థిగా భగవంత్ మాన్