ETV Bharat / bharat

'అర్హులందరికీ సొంత ఇళ్లు.. కౌలు రైతులకు ఆర్థిక సాయం' - గోవా అసెంబ్లీ పోల్స్​

Goa BJP Manifesto 2022: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది భాజపా. ఈ క్రమంలో గోవాలో ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు, అర్హులైన అందరికీ ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. పంజాబ్​లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికోసం రూ.5వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్​ను కేటాయిస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థులకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పింది.

Goa polls  BJP unveils manifesto
గోవా అసెంబ్లీ ఎన్నికలు మేనిఫెస్టో
author img

By

Published : Feb 8, 2022, 10:02 PM IST

Goa BJP Manifesto 2022: గోవాలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది భాజపా. ఈ మేరకు మంగళవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రతి ఇంటికి మూడు గ్యాస్​ సిలిండర్​లు ఉచితంగా ఇస్తామని, వచ్చే 10 ఏళ్లలో గోవాను 50 బిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చుదిద్దుతామని మేనిఫెస్టోలో పొందుపరిచింది భాజపా.

అంతేకాక అర్హులైన అందరికీ ఇళ్లు, మైనింగ్ కార్యకలాపాలను పునరుద్ధరించడం చేపడతామని హామీ ఇచ్చింది.

ఈ మేరకు గోవా సీఎం ప్రమోద్​ సావంత్, ఆ రాష్ట్ర భాజాపా అధ్యక్షుడు సదానంద్ షేత్ తన్వాదేలు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పేదరికం అన్నదే లేకుండా చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది భాజపా.

"పేదలకు సంక్షేమ పథకాలను సమయానికి అందిస్తాం. వృద్ధులకు పింఛను రూ.3వేలకు పెంచుతాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నిలిచిపోయిన మైనింగ్ పనులను తిరిగి ప్రారంభిస్తాం. వచ్చే ఐదేళ్లలో గోవాలో పర్యటకుల సంఖ్యను పెంచేందుకు పార్టీ కట్టుబడి ఉంది. యువతకు ఒలింపిక్స్​లో అవకాశాలను పెంచేందుకు 'మిషన్ గోల్డ్ కోస్ట్​' కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం" అని భాజపా మేనిఫెస్టోలో పేర్కొంది.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికోసం..

పంజాబ్ ఎన్నికల క్రమంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికోసం 'సంకల్ప్​' పేరుతో ప్రత్యేక 11 పాయింట్ల డాక్యుమెంట్​ను విడుదల చేసింది భాజపా.

  • సేంద్రీయ వ్యవసాయం, అగ్రికల్చర్​కు రూ. 5వేల కోట్లు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు. వర్షపు నీరు సంరక్షణ.
  • గ్రామీణప్రాంతాల్లోని యువత ఆటల్లో రాణించేందుకు ప్రత్యేక విధి విధానాలు.
  • ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు రుణమాఫీ.
  • ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద భూమి లేని ప్రతి రైతుకు ఏడాదికి రూ. 6వేలు ఆర్థిక సాయం.
  • కాల్వలపై సోలార్ ట్యూబ్​వెల్స్​, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసిన రైతులకు ప్రత్యేక సబ్సిడీ.
  • ముఖ్యమైన శాస్త్రీయ విత్తనాలకోసం రాష్ట్ర వ్యాప్తంగా సీడ్ బ్యాంక్స్ ఏర్పాటు.
  • ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద పెండింగ్​లో ఉన్న ప్రాజెక్ట్​లు పూర్తి, కొత్త ప్రాజెక్టులు ఆవిష్కరణ.
  • ఎంఎస్​ఎంఈలను ప్రోత్సహించే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉచితంగా రుణాలు.
  • విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థులకు బస్సులో ఉచిత ప్రయాణం.
  • గ్రామాల్లో ఆట స్థలాలు, అంతర్జాతీయ స్థాయిలో హాకీ, కబడ్డీ ఆటగాళ్లు తయారు కోసం ప్రత్యేక సౌకర్యాలు.

సిక్కుల ఆచారాలకు అండగా..

punjab election 2022: పంజాబ్​లో ఉన్న అనిశ్చితిని తొలగించి.. కొత్త పంజాబ్​ను నిర్మించాలని భాజపా, కూటమి పార్టీలు చూస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. పంజాబ్​లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తొలిసారి వర్చువల్ ర్యాలీ నిర్వహించారు మోదీ. ఎన్​డీఏ కూటమి ఎప్పుడూ సిక్కుల ఆచారాలకు అండగా ఉంటూ వస్తోందన్నారు.

ఈ మేరకు 10వ సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ కుమారులు షాహిబ్​జాదా జోరావర్, షాహిబ్​జాదా ఫతేసింగ్​ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. భాజపా, కూటమి పార్టీలు పంజాబ్ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు.

పంజాబ్​ ఎన్నికల్లో భాజపా, పంజాబ్​ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్​- సంయుక్త్ పార్టీలు కలిసి బరిలోకి దిగుతున్నాయి.

పొరపాట్లు వద్దు..

uttarakhand election 2022: ఫిబ్రవరి14న ఉత్తరాఖండ్​లో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి పొరపాట్లు చేయోద్దని ప్రధాని మోదీ సూచించారు. ప్రజలు 'డబుల్ ఇంజిన్​ గవర్న్​మెంట్​'కు ఓటెయ్యాలని అన్నారు. రాష్ట్రంలోని రోడ్లు, రహదారుల నిర్మాణం కోసం ఏడేళ్లలో రూ.33,000 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు మోదీ.

2014 నుంచి యూపీఏ ప్రభుత్వం 3,800కిలోమీటర్లు రహదారులు నిర్మిస్తే.. భాజపా 13,500 కిలోమీటర్లు నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

గోవాలో​ 'గేమ్​ ఛేంజర్'గా​ క్రిస్టియన్లు- ఎవరికి మద్దతిచ్చేనో?

మహిళల గురించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు.. ఎన్నికల్లో పోటీకి మాత్రం..

ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ.. ఎమ్మెల్యేలంతా భాజపా కూటమిలోకి!

'రైతులకు ఉచిత కరెంట్.. 'లవ్ జిహాద్' దోషులకు పదేళ్లు జైలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.