ETV Bharat / bharat

ప్రపంచం కోసం భారత్.. జీవ ఇంధన కూటమి ఏర్పాటు.. వారందరికీ మోదీ పిలుపు - జీవ ఇంధన కూటమి

Global Biofuel Alliance Launch PM Modi : జీ20 సదస్సులో భాగంగా భారత్.. ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జీవ ఇంధనాల అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా పనిచేద్దామని సభ్య దేశాలకు పిలుపునిచ్చింది.

global-biofuel-alliance-launch
global-biofuel-alliance-launch
author img

By PTI

Published : Sep 9, 2023, 4:52 PM IST

Updated : Sep 9, 2023, 6:08 PM IST

Global Biofuel Alliance Launch PM Modi : జీ20కి నాయకత్వం వహిస్తున్న భారత్.. ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చే దిశగా మరో కొత్త కూటమిని ఆవిష్కరించింది. పెట్రోల్​లో 20 శాతం ఇథనాల్ కలిపేలా చొరవ తీసుకోవాలని పిలుపునిస్తూ 'ప్రపంచ జీవ ఇంధన' కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జీ20 సదస్సులో ( G20 Summit 2023 ) భాగంగా శనివారం ఉదయం నిర్వహించిన 'ఒకే భూమి' కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేశారు. సరికొత్త జీవ ఇంధనాల అభివృద్ధికి ప్రపంచం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

  • #WATCH | G-20 in India: PM Narendra Modi launches 'Global Biofuels Alliance' in the presence of US President Joe Biden, President of Brazil Luiz Inacio, President of Argentina, Alberto Fernández and Prime Minister of Italy Giorgia Meloni. pic.twitter.com/fPpm77ONax

    — ANI (@ANI) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జీవ ఇంధనాల విషయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయడం తక్షణావసరం. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్​లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతం వరకు కలపాలని మేం ప్రతిపాదిస్తున్నాం. లేదంటే సరికొత్త ప్రత్యామ్నాయ మిశ్రమాన్ని అభివృద్ధి చేసేందుకు మనం ప్రయత్నించవచ్చు. అలా జరిగితే.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూనే, ఇంధన సరఫరాకు లోటు లేకుండా చూడటం సాధ్యమవుతుంది."
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

What Is Biofuel Alliance : వాతావరణ మార్పులు, ఇంధన భద్రతపై ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. భారత్ తాజా కూటమిని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ ఇంధన పరివర్తనకు మద్దతుగా స్థిరమైన ఇంధనం అభివృద్ధిని వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా.. ఈ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో జీ20 సభ్యులంతా భాగం కావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఇంధన పరివర్తన కోసం ట్రిలియన్లకొద్దీ వ్యయం అవుతుందని పేర్కొన్న ఆయన.. అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయంలో ప్రధాన భూమిక పోషిస్తాయని పేర్కొన్నారు.

"పర్యావరణంలో మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో ఇంధన పరివర్తన సాధించడం 21వ శతాబ్దానికి అత్యంత కీలకం. సమ్మిళిత ఇంధన పరివర్తన కోసం ట్రిలియన్లకొద్దీ వ్యయం అవుతుంది. పర్యావరణం కోసం 100 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అభివృద్ధి చెందిన దేశాలు ప్రకటించాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఈ మేరకు సానుకూల చొరవ తీసుకోవడం సంతోషకరం."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

అమెరికా, కెనడా, బ్రెజిల్‌ సహా ( Global Biofuel Alliance Members ) ప్రపంచ జీవ ఇంధన కూటమిలో 15కుపైగా దేశాలు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, కోపెన్​హేగెన్​లో 2009లో నిర్వహించిన ఐరాస పర్యావరణ సదస్సులో అభివృద్ధి చెందిన దేశాలు '100 బిలియన్ డాలర్ల హామీ'ని ఇచ్చాయి. పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్ల చొప్పున ఇస్తామని ప్రకటించాయి. కానీ ఈ హామీని సంపన్న దేశాలు నిలబెట్టుకోలేకపోయాయి.

  • At the One Family Session of the G20 Summit, elaborated on how to collectively think about empowering fellow humans and making our planet more inclusive as well as sustainable.

    Gave the example of how technology has been leveraged to bring a positive difference in the lives of… pic.twitter.com/SqT9OjStps

    — Narendra Modi (@narendramodi) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జీవ ఇంధనం అంటే?
వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రీయ వ్యర్థాల ద్వారా తయారయ్యే ఏ ఇంధనాన్ని అయినా జీవఇంధనం అంటారు. మానవులు పురాతనకాలం నుంచి జీవఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు వంట చేయటానికి, ఉష్ణం, వెలుతురు కోసం కలపను, పేడను కాల్చేవారు. ఇతర వనరుల కంటే శుద్ధ ఇంధనం ఇటీవలి దశాబ్దాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జీవ ఇంధనాన్ని వనరుల ఆధారంగా వర్గీకరించారు. ప్రతి కేటగిరీని ఓ తరంగా పేర్కొంటారు. మొదటితరం జీవ ఇంధనాన్ని మొక్కజొన్న, చెరకు ద్వారా తయారుచేస్తారు. ఆహారానికి ఉపయోగపడని వృక్షాలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి రెండోతరం, ఆల్గే నుంచి మూడోతరం జీవ ఇంధనాన్ని తయారు చేస్తారు. ఇథనాల్‌, బయోడీజిల్‌, బయోగ్యాస్‌.. జీవఇంధనాలుగా ప్రాచుర్యం పొందాయి.

జీవ ఇంధనం ఎప్పుడూ శుద్ధ ఇంధనమేనా అంటే కాదని చెప్పాలి. జీవ ఇంధనం ఎలా ఉత్పత్తి చేస్తారనే అంశంపై అది ఆధారపడి ఉంటుంది. పునరుత్పాదక శక్తితో వ్యర్థాలు లేదా వృక్ష సంపద నుంచి తయారయ్యే జీవఇంధనం.. గ్రీన్‌హౌస్ వాయులను తక్కువగా కలిగి ఉండటం లేదా ఏ మాత్రం లేకుండా ఉంటుంది. అయితే ఇథనాల్ తయారీ కోసం మొక్కజొన్న, సోయాబీన్స్‌, చెరకు లేదా పామ్‌ పంటల సాగుకు ఎరువులు, శిలాజ ఇంధనాన్ని ఉపయోగిస్తే కర్బన ఉద్ఘారాల విడుదల పెరుగుతుంది. ఆహారం పంటల ఉత్పత్తికి వాడే భూమిని శక్తి కోసం ఉపయోగిస్తే అది అడవుల నరికివేతకు దారితీసే ప్రమాదం ఉంటుంది. భూమి వాడకం మారితే కర్బన ఉద్గారాల విడుదల పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జీవ ఇంధనాన్ని వాహనాలు, షిప్పింగ్‌, విమానయానం కోసం ఉపయోగించనున్నారు. శిలాజ ఇంధనంతో పోలిస్తే.. జీవఇంధనంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కర్బన ఉద్గారాల విడుదల చాలా తక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో విమానయానం, కొన్నిరకాల నౌకల్లో శిలాజ ఇంధన స్థానాన్ని జీవ ఇంధనాలు భర్తీ చేసే అవకాశాలున్నాయి. సేంద్రీయ వ్యర్థాలు, బంజరుభూమిలో పండించిన పంటల నుంచి, ఆహార ఉత్పత్తికి కేటాయించిన భూములు కాకుండా, అడవులను నరకకుండా జీవ ఇంధనం తయారు చేస్తే ప్రయోజనకరంగానే ఉంటుంది. ముఖ్యంగా స్థానికంగా సాగుచేసిన పంటలను జీవఇంధనం తయారీకి ఉపయోగిస్తే.. ఉపాధి అవకాశాలతోపాటు ఇంధన భద్రతకు దోహదం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

జీవ ఇంధనంపై కేంద్రం దృష్టి- ఆహార భద్రతకు ముప్పుందా?

2045 వరకు చమురే ప్రధాన ఇంధన వనరా?

Last Updated : Sep 9, 2023, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.