ETV Bharat / bharat

గ్రామస్థుల సంకల్పం.. 15 రోజుల్లోనే ప్లాస్టిక్​కు చెక్.. ఒకే ఒక్క నినాదంతో.. - అనంతనాగ్ లేటెస్ట్ న్యూస్​

ప్రస్తుతం ప్రపంచంలో ఎటు చూసినా ప్లాస్టిక్​ భూతమే కనిపిస్తుంది. దీని కారణంగా ఎందరో క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్య జీవితంలో బాగమైన ఈ ప్లాస్టిక్​ను నియంత్రించడానికి ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు చేపట్టినా సరే ఆశించినంత ఫలితం రావడం లేదు. అయితే జమ్ముకశ్మీర్​లోని ఓ చిన్న గ్రామంలో అసలు ప్లాస్టిక్​ అన్నదే లేదు. అదేలా సాధమైంది.. దానికోసం ఆ గ్రామస్థులు ఏం చేశారంటే?

environment pollution free
environment pollution free
author img

By

Published : Apr 5, 2023, 8:03 AM IST

ప్లాస్టిక్ భూతాన్ని అంతమెుందించేందుకు ఓ కుగ్రామం నడుం బిగించింది. "ప్లాస్టిక్ ఇవ్వు.. బంగారం పట్టు" అనే నినాదంతో ఆ గ్రామ పంచాయతీ చేపట్టిన కార్యక్రమంతో 15 రోజుల్లోనే.. ఆ గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా తయారైంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది? తమ గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు ఆ గ్రామస్థులు ఏం చేశారు? అసలు ప్లాస్టిక్ తెస్తే బంగారం ఇస్తా అని ఎందుకన్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని హిల్లర్ షాబాద్ బ్లాక్‌లోని ఉన్న ఆ ఊరి పేరు సాదివార. ప్లాస్టిక్‌ మహమ్మారిని తరిమికొట్టాలన్న ఆ గ్రామస్థుల సంకల్పం.. అందరి సహకారంతో 15 రోజుల్లోనే నెరవేరింది. గ్రామంలోని ప్రతీ ఒక్కరు ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా ఉపేక్షించకుండా.. సేకరించి ఓ చోట చేర్చారు. వినూత్నంగా ఆలోచించిన ఆ గ్రామస్థులు తమ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు.

environment pollution free
ప్లాస్టిక్​ వ్యర్థాలు లేకుండా స్వచ్ఛంగా కనిపిస్తున్న కాలువ

పర్యావరణాన్ని కాపాడుకునేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఫారూక్‌ అహ్మద్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. న్యాయవాది అయిన ఫారూక్‌.. ప్లాస్టిక్‌ను ఎలాగైనా తమ గ్రామం నుంచి తరిమి కొట్టాలని భావించారు. దీంతో "ప్లాస్టిక్ తెచ్చివ్వండి.. బంగారం తీసుకెళ్లండి" అంటూ గ్రామస్థులకు బంపరాఫర్ ఇచ్చారు. 20 క్వింటాళ్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువచ్చిన వారికి బంగారు బిళ్లను ఇవ్వడం మెుదలు పెట్టారు. ఇది తెలుసుకున్న గ్రామస్థులు.. ఇళ్లు, వీధుల్లో ఉన్న ప్లాస్టిక్‌ను సేకరించడం ప్రారంభించారు.

environment pollution free
గ్రామంలోని ప్లాస్టిక్​ను సేకరిస్తున్న గ్రామస్థులు

"మా గ్రామంలో, 'ప్లాస్టిక్​ను తెచ్చి ఇవ్వండి.. బహుమతిగా బంగారాన్ని పొందండి' అనే కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. దీంతో పాటుగా నదులు కాలువలు శుభ్రం చేయడానికి చొరవ తీసుకున్నాను. ఇప్పుడు గ్రామంలోని ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేస్తున్నారు"
-- ఫారూక్‌ అహ్మద్, సాదివార గ్రామ సర్పంచ్​

ప్లాస్టిక్ తెచ్చి బంగారం తీసుకెళ్లండి అని ప్రచారం ప్రారంభించిన 15 రోజుల్లోనే ఊరంతా స్వచ్ఛంగా మారింది. దీంతో అధికారులు సాదివార గ్రామాన్ని 'స్వచ్ఛ భారత్ అభియన్​-2' కింద ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు. ఈ ప్రయత్నంతో సాదివార గ్రామంపై ప్రశంసల జల్లు కురిసింది. ఇది తెలుసుకున్న ఇతర గ్రామాలు కూడా ఇదే విధానాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ విధానంతో గ్రామమే కాకుండా సమీపంలోని వాగులు, నదులు కూడా శుభ్రమయ్యాయని గ్రామ సర్పంచ్ ఫారూక్‌ తెలిపారు. ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని పాటించి కశ్మీర్‌లోని అన్ని గ్రామాల్లోనూ అమలు చేయాలని సూచించారు. ఇది ప్రభుత్వ పథకం కాకపోయినా సాదివారా గ్రామస్థులు తమ గ్రామాన్ని స్వచ్ఛంగా మార్చుకున్నారని జిల్లా యంత్రాంగం అభినందనలు తెలిపింది.

environment pollution free
ప్లాస్టిక్​ను ఏరుతున్న గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.