ETV Bharat / bharat

మాజీ ప్రియుడిపై పగతో కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేయించిన లా స్టూడెంట్ - ఎలా దొరికిపోయిందంటే? - గంజాయి కేసు

Girlfriend Revenge on Ex Boyfriend for Putting Ganja in Car : ప్రేమబంధం దూరమైతే ఒకనాడు త్యాగానికి నిదర్శంగా నిలుస్తుండేది. అలా చరిత్ర పుటల్లోకెక్కిన వారెంతో మంది ఉన్నారు. నేటి రోజుల్లో మాత్రం ప్రేమించుకున్న వారు దూరమైతే ప్రతీకారానికి ఆజ్యం పోస్తోంది. ఇలా నేరచరిత్రల్లోకెక్కిన వారూ ఎంతో మంది పెరుగుతూనే ఉన్నారు. ఇందుకు నిదర్శనంగా నిలిచేలా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్​లో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన ప్రేమ అనే బంధానికే మచ్చ తెచ్చేలా ఉంది. మాజీ ప్రియుడిపై పగతో గంజాయి కేసులో ఇరికించాలని ప్రియురాలు చూసింది. ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజం తెలిసింది.

Girlfriend Revenge on Ex Boyfriend
Girlfriend Revenge on Ex Boyfriend for Putting Ganja in Car
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 4:25 PM IST

Updated : Dec 26, 2023, 5:56 PM IST

Girlfriend Revenge on Ex Boyfriend for Putting Ganja in Car : గత చరిత్రను చూస్తే ప్రేమ కోసం ప్రాణాలనే త్యాగం చేసిన ప్రేమికులను చూశాము. అలాంటి వారిలో లైలా మజ్నూ, పారూదేవదాస్ వంటి జంటలు ముందువరుసలో నిలుస్తాయి. మరికొంత మంది ప్రేమికులు అనేక కారణాలతో విడిపోయినా ఎవరి జీవితం వారు ప్రశాంతంగా గడుపుతున్నారు. అలా రోజులు మారుతున్న కొలదీ ఇప్పుడు ప్రేమ అంటే డబ్బు, ఆ క్షణం సుఖం కోసం వెపర్లాడే ప్రేమ జంటలే ఎక్కువ.

ఈ మధ్యకాలంలో ప్రేమికులు విడిపోతే ప్రియుడు, ప్రియురాలిని వారు ఏకాంతంగా ఉన్న వీడియోలు, ఫొటోలను చూపించి బెదిరించిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే వాటన్నింటికీ భిన్నంగా ప్రియురాలే మాజీ ప్రియుడిపై పగతో గంజాయి కేసులో ఇరికించి పోలీసులకు పట్టించింది. ఈ కేసును విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసి, చివరికి ఆమెనే అరెస్టు చేశారు. ప్రేమ బంధానికే బీటలు బారేలా చేసిన సంఘటన హైదరాబాద్​లో జరిగింది.

జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే హైదరాబాద్ రెహమత్ నగర్​కు చెందిన రింకీ అనే యువతి, సరూర్​నగర్​కు చెందిన శ్రవణ్ ఒకే ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్లు యువతీయువకుడు కలిసి తిరగ్గా రింకీ ప్రవర్తన నచ్చక శ్రవణ్ ఆమెను దూరం పెట్టాడు. తనను కాదన్నాడని శ్రవణ్​పై కోపం పెంచుకున్న యువతి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి కారులో జూబ్లీహిల్స్ కృష్ణకాంత్ పార్కు వద్దకు రింకీ వెళ్లింది. అక్కడకు ఆ యువకుడిని పిలిచింది.

ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. అసలేం జరిగిందంటే?

ప్రియుడిని పోలీసులకు పట్టించడం : అందరూ కలిసి సమీపంలోని పబ్​కు వెళ్లారు. కారులో వెళుతున్న సమయంలోనే అప్పటికే వెంట తెచ్చుకున్న గంజాయి(Ganja)ని కారులో రింకీ పెట్టుకుంది. అనంతరం స్నేహితులతో కలిసి పబ్​లోకి వెళ్లింది. తర్వాత పోలీసులకు సమాచారం అందించి, శ్రవణ్ అనే యువకుడు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందించింది. పబ్​ వద్దకు చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా కారు తనది కాదని చెప్పాడు.

ఆతర్వాత రింకీ స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో గంజాయి కుట్ర వెలుగులోకి వచ్చింది. 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రింకీతో పాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని మంగల్​హాట్​లో కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

పెళ్లికి ఒప్పుకోలేదని లవర్​పై కోపం- స్కూల్​ నుంచి బయటకు రాగానే టీచర్ కిడ్నాప్

ప్రియురాలిని హత్య చేశానని పోలీసులకు ప్రియుడు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..!

Last Updated : Dec 26, 2023, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.