ETV Bharat / bharat

7వ అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి - గ్రేటర్​ నోయిడా క్రైమ్​

Girl fell down naked: విశాలవంతమైన అపార్ట్​మెంట్​లోని 7వ అంతస్తు నుంచి ఓ యువతి నగ్నంగా కిందపడింది. ఈ ఘటన గ్రేటర్​ నోయిడాలో జరిగింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

greater noida news
7వ అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి
author img

By

Published : Dec 20, 2021, 12:18 PM IST

Girl fell down naked: బంగాల్​కు చెందిన ఓ యువతి.. తన ప్రియుడి కోసం ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోయింది. వారిద్దరు పానిపట్​లో వివాహం చేసుకున్నారు. అయితే వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పలు కారణాల వల్ల వారు విడిపోయారు. ఆ తర్వాత ఆ యువతి పానిపట్​లోని ఓ షాపింగ్​ మాల్​లో పనిచేయడం మొదలుపెట్టింది.

ఈ సమయంలోనే గ్రేటర్​ నోయిడాలోని ఓ ఎన్​ఆర్​ఐ సొసైటీకి చెందిన నితిన్​ గుప్తతో ఆ యువతికి పరిచయమైంది. అతను ఓ కెమికల్​ ఇంజినీర్​.

ఈ నెల 12న ఉదయం.. నితిన్​ గుప్త నివాసం కింద ఆ యువతి నగ్నంగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా నితిన్​ గుప్తను విచారించారు పోలీసులు. 'కొవిడ్​ కారణంగా.. నా భార్య గతేడాది మరణించింది. అప్పుడే ఆ యువతితో నాకు పరిచయం ఏర్పడింది. తరచూ కలుస్తూ ఉండేవాళ్లం. ఆ రోజు తను నా ఇంటికి వచ్చింది. ఇద్దరం భోజనం చేసి పడుకున్నాము. ఉదయం ఆరు గంటల సమయంలో తను లేచి బాత్​రూంకు వెళ్లింది. బాత్​రూం కిటికీలో నుంచి బయటకు పడిపోయింది. నా ఇల్లు 7వ అంతస్తులో ఉంది' అని నితన్​.. పోలీసులకు చెప్పాడు.

యువతి ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు పోలీసులు. అయితే తమ బిడ్డ ఐదేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, అప్పుడే తమ దృష్టిలో ఆమె చనిపోయిందని తెలిపారు.

ఈ పూర్తి వ్యవహారంపై గ్రేటర్​ నోయిడా బేటా-2 పోలీస్​ స్టేషన్​ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:- బైక్​ను ఢీకొట్టిన లారీ.. కవల పిల్లలు నుజ్జునుజ్జు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.