కేరళ మలప్పురంలో దారుణం జరిగింది. తన ప్రేమను తిరస్కరించిన యువతిని అత్యంత పాశవికంగా పొడిచి చంపాడు ఓ యువకుడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె సోదరిని కూడా గాయపరిచాడు.

ఇదీ జరిగింది...
నిందితుడు వినీశ్.. ఆ అమ్మాయిని చదుకునే రోజుల నుంచి ప్రేమించేవాడు. ఇటీవల తన ప్రేమ విషయాన్ని యువతి ముందు ఉంచాడు. అందుకు ఇష్టం లేని ఆమె.. ప్రపోజల్‌ను తిరస్కరించింది. దీంతో ఆ అమ్మాయిపై కోపం పెంచుకున్న వినీశ్.. ఆమె తండ్రి దుకాణానికి నిప్పంటించాడు. అనంతరం రహస్యంగా ఆమె ఇంటికి చేరుకుని ఓ గదిలో నక్కాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధరించుకుని యువతిపై అతి కిరాతకంగా దాడి చేశాడు.
యువతి మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు.. ఆమె శరీరంపై 22 కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. అలా కిరాతకంగా పొడవడం వల్ల అధిక రక్తస్రావమై యువతి చనిపోయిట్లు వెల్లడించారు. ఆమె ఎద భాగంలో నాలుగు, పొత్తి కడుపులో మూడు, ఇతర శరీర భాగాల్లో 22 కత్తి పోట్లను శవ పంచనామాలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: మహిళ అండాశయంలో 15కిలోల కణతి