ETV Bharat / bharat

Girl sense of timing: మృత్యువునే భయపెట్టిందిగా..! ఆ బాలిక సమయస్ఫూర్తికి ప్రతి ఒక్కరూ సెల్యూట్ - తల్లీకూతుళ్లపై హత్యాయత్నం

Girl sense of timing: ప్రాణం పోయే స్థితిలో 13 ఏళ్ల బాలిక చూపిన సమయస్ఫూర్తి... అందరితో శభాష్‌ అనిపించుకుంటోంది. కళ్లెదుటే తల్లి, చెల్లి గోదారి ప్రవాహంలో కొట్టుకుపోతున్నా.. తాను పైపునకు వేలాడుతూ 13ఏళ్ల కీర్తన ప్రాణాలు దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాలిక తెగువకు అందరూ హ్యాట్సాఫ్‌ అంటున్నారు.

Girl_sense_of_timing
Girl_sense_of_timing
author img

By

Published : Aug 7, 2023, 1:19 PM IST

Updated : Aug 7, 2023, 2:46 PM IST

Girl sense of timing: చుట్టూ చీకటి. కింద ఉద్ధృత గోదారి ప్రవాహ శబ్దం... అప్పటి వరకూ తనతో ఆనందంగా గడిపిన తల్లి, చెల్లి కళ్లముందే అదే నదిలో పడిపోగా.. తాను కూడా కిందపడే సమయంలో చేతికందిన వస్తువును పట్టుకొని వేలాడుతోంది. రెప్పపాటులో ప్రమాదం దూరమైనా... మృత్యువు కాచుకొనే ఉంది. కానీ ఆ 13 ఏళ్ల బాలిక విధిని ఎదిరించింది. ఏం జరిగిందో.. ఏం జరుగుతుందో ఆలోచించడానికే సమయం లేని సందర్భంలోనూ.. శక్తినంతా కూడదీసుకుని సమయస్ఫూర్తిని చాటింది. బాలిక ధైర్యసాహసాలు మృత్యువును కూడా భయపెట్టాయో ఏమో..! ప్రాణాలతో వదిలేసి వెళ్లిపోయింది.

Girl_sense_of_timing

అనంతపురంలో దారుణం.. భార్య గొంతుకోసిన భర్త

Murder plan కీర్తన తల్లి సుహాసినిది గుంటూరు జిల్లా తాడేపల్లి కాగా.. కొన్నాళ్లుగా భర్తతో విభేదించి ఒంటరిగా ఉంటోంది. కూలి పని చేసుకుంటూ కుమార్తె కీర్తనతో కలిసి ఉంటున్న ఆమెకు రెండేళ్ల క్రితం ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్‌ పరిచయమయ్యాడు. వీరు సహజీవనం కొనసాగిస్తున్న క్రమంలో ఏడాది కిందట పాప జన్మించింది. ఇద్దరి మధ్య మనస్ఫర్థలు పెరిగిపోగా.. సుహాసినిని అడ్డుతొలగించుకోవాలని సురేశ్ ప్లాన్ చేశాడు. ఆమెతో పాటు ఇద్దకు కూతుళ్లను సైతం వదిలించుకోవాలనుకున్న సురేశ్.. రాజమహేంద్రవరంలో దుస్తులు కొందామంటూ ముగ్గురినీ తీసుకొని కారులో బయల్దేరాడు. ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు రావులపాలెంలోని గౌతమి పాత వంతెనవద్దకు తీసుకొచ్చి... సెల్ఫీ తీసుకుందామని చెప్పి పిల్లలతో సహా రెయిలింగ్‌ వద్ద పిట్టగోడపై నిలబెట్టాడు. వారందరినీ నదిలోకి తోసేసి సురేశ్ పరారుకాగా, సుహాసిని, జెర్సీ మాత్రమే నదిలో పడిపోయారు.

Emergency call 13ఏళ్ల బాలిక కీర్తన వంతెన పక్కగా వేసిన కేబుల్‌ పైపు చేతికి అందడంతో దానికి గట్టిగా పట్టుకుని వేలాడుతూ ఎవరైనా రక్షిస్తారేమో అని గట్టిగా కేకలు వేసింది. పట్టు తప్పిపోకుండా ఒంటిచేత్తో పైపును గట్టిగా పట్టుకుని వేలాడుతూనే.. మెల్లగా మరో చేత్తో తన జేబులో ఉన్న ఫోన్‌ బయటకు తీసింది. శక్తినంతా కూడదీసుకుని 100 నంబరుకు కాల్‌ చేసింది. వణికిపోతున్న స్వరంతో మెల్లగా తానున్న పరిస్థితిని వివరించింది. రావులపాలెం ఎస్‌ఐ.వెంకటరమణ సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడకు చేరుకుని కీర్తనను క్షేమంగా పైకి తీసుకువచ్చారు. చిమ్మచీకటిలో.. సుమారు అరగంటపాటు కేబుల్ పైపు ఆధారంతో వేలాడుతూ ఫోన్‌ చేసిన వైనం పోలీసులు ఆశ్చర్యానికి గురిచేసింది. విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ కీర్తన ధైర్యాన్ని అభినందించారు.

Attack: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని కారుతో ఢీకొట్టి

selfy picture రావులపాలెంలో గౌతమి వంతెనపై నుంచి మహిళ, ఇద్దరు కూతుళ్లను ఓ వ్యక్తి గోదావరిలోకి నెట్టేశాడనే వార్త కలకలం రేకెత్తించింది. ఈ దారుణ ఘటనలో తల్లి, ఏడాది వయస్సున్న ఆమె చిన్న కూతురు గల్లంతవగా.. పెద్ద కుమార్తె.. వంతెనకు అమర్చిన కేబుల్ పైపును పట్టుకొని ప్రాణాలు దక్కించుకుంది. బాధిత మహిళ సుహాసిని.. భర్తతో విడాకులు తీసుకుని గుడివాడకు చెందిన ఉలవ సురేశ్‌తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. అప్పటికే ఓ కూతురు ఉన్న సుహాసిని మరో కూతురుకు జన్మనిచ్చింది. అయితే, ఇటీవల ఇద్దరి మధ్య గొడవల కారణంగా.. సుహాసినితో పాటు ఆమె పిల్లలను చంపివేయాలని సురేశ్ పథకం వేశాడు. కారు కొనుగోలు చేద్దామని చెప్పి.. సుహాసిని, ఇద్దరి పిల్లలతో కలిసి రాజమహేంద్రవరానికి ఆదివారం తెల్లవారుజామున పయనమయ్యాడు. రావులపాలెం గౌతమి వంతెన వద్దకు రాగానే కారు ఆపి సెల్ఫీ తీసుకుందామని చెప్పి సుహాసినిని కారు దింపాడు. పథకం ప్రకారం.. ముందుగా ఆమెను గోదావరిలోకి నెట్టి వేసిన సురేశ్.. ఆపై కారులో ఉన్న చిన్నారి జెర్సీని గోదావరిలో విసిరేశాడు. 13 ఏళ్ల కీర్తననూ వంతెన పైనుంచి నెట్టి వేయగా.. ఆ బాలిక, వంతెనకున్న కేబుల్ గొట్టాన్ని పట్టుకుని వేలాడింది. ముగ్గురూ గోదావరిలో పడిపోయారని భావించిన సురేశ్.. అక్కడి నుంచి కారులో వెళ్లిపోయాడు. అయితే, పైప్ పట్టుకున్న కీర్తన.. మరో చేత్తో జాగ్రత్తగా పైపును ఒడిసి పట్టుకుని మరో చేత్తో.. తన వద్ద ఉన్న ఫోన్ తీసుకుంది. 100 నంబర్​కు కాల్ చేయగా.. పోలీసులు హుటాహుటిన స్పందించి బాలికను కాపాడగలిగారు. కీర్తన సుమారు అరగంట సేపు పైపును పట్టుకుని వేలాడటం సాహసోపేత చర్య కాగా.. ఆ విషయం తెలిసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. నదిలో పడిపోయిన సుహాసిని, ఆమె చిన్న కూతురు కోసం పోలీసులు గోదావరిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేశారు.

Murder Attempt: భార్యా బిడ్డలపై కర్కశత్వం.. విద్యుత్తు తీగలు చుట్టి..

మనిషి కాదు రాక్షసుడు.. భార్య, ఇద్దరు పిల్లలను అంతం చేయడమే లక్ష్యంగా పథకం వేసిన సురేశ్ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రూర మృగాలు సైతం తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయని.. అలాంటిది ముక్కుపచ్చలారని పసికందు సహా మూడు ప్రాణాలను బలికోరడంపై మండిపడుతున్నారు. సురేశ్​పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

Last Updated : Aug 7, 2023, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.