ETV Bharat / bharat

Girl Raped in Train: రన్నింగ్​ ట్రైన్​లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం

Girl Raped in Train: ఆరేళ్ల చిన్నారిపై రన్నింగ్​ ట్రైన్​లో అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. అతడిని పట్టుకున్న సహ ప్రయాణికులు.. పోలీసులకు అప్పగించారు.

rape case
Girl Raped in Train
author img

By

Published : Feb 19, 2022, 5:59 AM IST

Girl Raped in Train: మహారాష్ట్రలో దారుణం జరిగింది. రన్నింగ్​ ట్రైన్​లో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. సహ ప్రయాణికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ఇదీ జరిగింది..

ఠాణె జిల్లాలోని బద్లాపుర్​కు చెందిన ఆరేళ్ల బాలికపై ఈ దారుణం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి కాశీ ఎక్స్​ప్రెస్​లో వెళ్తుండగా నిందితుడు అశోక్ ప్రజాపతి.. చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో బాలిక కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నారు.

అయితే చిన్నారి శబ్దాలకు అప్రమత్తమైన సహ ప్రయాణికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోక్సో చట్టం కింద అతడిపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

హత్యాచార దోషికి 20 ఏళ్ల జైలు..

మూడేళ్ల క్రితం నాలుగున్నర ఏళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నేరస్థుడికి కఠిన శిక్ష విధించింది ఉత్తర్​ప్రదేశ్​ ఫరీదాబాద్​లోని స్థానిక కోర్టు. దోషిగా తేలిన నసీర్​ ఖాన్​ అలియాస్ సమీర్​ ఖాన్​కు 20 ఏళ్ల జైలు శిక్ష సహా రూ.5 వేల జరిమానా విధించింది.

ఇదీ చూడండి: ఆవు దూడపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి పైశాచికానందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.