Girl Rape In Anuppur: మధ్యప్రదేశ్ అనుప్పుర్ జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. లైంగిక వాంఛను పెంచే డ్రగ్స్(అఫ్రోడిసియాక్)ఇచ్చి 17 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.
జననాంగం నుంచి తీవ్రరక్తస్రావం కావడం వల్ల బాలిక మృతిచెందినట్లు పోస్ట్‌మార్టంలో తేలిందని షాదోల్ జోన్ ఏడీజీ డీసీ సాగర్ తెలిపారు. శుక్రవారం రాత్రి, లేదా శనివారం ఈ ఘటన జరిగిఉండొచ్చన్నారు. చనిపోవడానికి ముందు.. జరిగిన విషయాన్ని బాలిక, తన తల్లిదండ్రులకు తెలిపిందన్నారు.
అదే గ్రామానికి చెందిన యశ్వంత్ మరవిని నిందితుడిగా గుర్తించామని.. పోక్సో చట్టం కింద కేసునమోదు చేసి.. అతడి ఆచూకి చెబితే రూ. 30వేలు రివార్డ్ ప్రకటించామన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు.
మోడల్‌పై సామూహిక అత్యాచారం..
Kakkanad Gang Rape: కేరళలోని కొచ్చి కక్కనాడ్లో ఫొటోషూట్కోసం వచ్చిన ఓ మోడల్‌పై.. ఆమె ఉంటున్న లాడ్జిలోనే మూడురోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.
ఏం జరిగిందంటే..?
Kakkanad Gang Rape: కేరళ, మలప్పురం జిల్లాకు చెందిన మోడల్.. ఫొటోషూట్ కోసం కొచ్చిలోని ఓ లాడ్జికి వచ్చింది. ఆ సమయంలో అలప్పుజాకు చెందిన సలీంకుమార్తో పరిచయం ఏర్పడింది. లాడ్జి యజమాని, మరొకవ్యక్తితో కలిసి సలీంకుమార్.. తనకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్ ఇచ్చి సామూహిక అత్యాచారం చేసినట్లు బాధితురాలు.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనను వీడియోతీసి తనను బెదిరించినట్లు తెలిపింది.
ఈ ఘటన డిసెంబరు 1-3 తేదీల్లో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే సలీంకుమార్ను అరెస్ట్ చేశామని, మరో ఇద్దరిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు.
Tags: girl rape, aphrodisiac drug, teenage girl rape, madhya pradesh news
ఇదీ చూడండి: ఐదుగురు పిల్లలతో బావిలో దూకి మృత్యుఒడికి..