ETV Bharat / bharat

దర్గా సమీపంలో బాలిక మృతదేహం.. ముక్కు కోసేసి, చేతులు కట్టేసి.. అసలేమైంది? - క్షుద్ర పూజలు అనుమానంతో వృద్ధుడి హత్య

ముక్కు కోసేసి, శరీరంపై గాయాలతో ఉన్న బాలిక మృతదేహం ఓ దర్గా సమీపంలో కనిపించడం మధ్యప్రదేశ్​లో కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు క్షుద్రపూజలు చేస్తున్నాడని ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

Burhanpur Murder in Dargah
మర్డర్
author img

By

Published : Nov 12, 2022, 10:32 PM IST

మధ్యప్రదేశ్​ బుర్హాన్​పుర్​లో దారుణం జరిగింది. ముక్కు కోసేసి ఉన్న బాలిక మృతదేహం దర్గా సమీపంలో లభ్యం కావడం కలకలం రేపింది. బాధితురాలు శుక్రవారం నుంచి కనిపించట్లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి ఆమె కోసం ఎంత వెతికినా ఆచూకీ లేదని అన్నారు. అనంతరం గణపతి పోలీస్ స్టేషన్​లో బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శనివారం ఉదయం ఆజాద్ వార్డులోని జలాలుద్దీన్ షా దర్గా కాంప్లెక్స్‌లోని పొదల్లో బాలిక మృతదేహం స్థానికులకు కనిపించింది. బాలిక చేతులను గుడ్డతో కట్టివేశారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయి. బాలిక ముక్కు కోసేసి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

క్షుద్రపూజల అనుమానంతో..
ఒడిశా మయుర్​భంజ్​లో అమానవీయ ఘటన జరిగింది. క్షుద్రపూజలు చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వృద్ధుడిని దారుణంగా చంపారు. శరీరం నుంచి తలను వేరు చేశారు. శుక్రవారం రాత్రి జరిగిందీ ఘటన. మృతుడు ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని ఖంగ్రూ సింగ్​గా గుర్తించారు.

ఇవీ చదవండి: దిల్లీలో భూకంపం.. భయంతో జనం పరుగులు.. ఆ ప్రాంతంలోనూ ప్రకంపనలు

రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల రిలీజ్.. భావోద్వేగంతో కన్నీళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.