ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్. దేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దేశంలో ఆరోగ్య వసతులు పెంచాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.లేఖకు సంబంధించిన ఓ కాపీని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు పంపించినట్లు పేర్కొన్నాయి.
" దేశంలోని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల సామర్థ్యం పెంచండి. కొవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ కోసం టీకాల సరఫరా వేగవంతం చేయండి. దేశంలో ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోండి"
- గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత.
దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై శనివారం ఉదయం.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మోదీ కంటతడి- ఆజాద్‌కు సెల్యూట్!